తెలంగాణ

telangana

ETV Bharat / state

గోల్డ్​ ట్రేడింగ్​లో పెట్టుబడుల పేరిట భారీ మోసం - 500 మంది దగ్గరి నుంచి రూ.కోట్లలో వసూలు! - Investment Fraud in Hyderabad - INVESTMENT FRAUD IN HYDERABAD

Gold Trading Investment Fraud in Hyderabad : అధిక లాభాల పేరిట ఆశజూపి మోసం చేసిన ఘటన హబ్సిగూడలో చోటుచేసుకుంది. ప్రహణేశ్వర్ ట్రేడర్స్‌ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించి, రూ.కోట్లు దండుకుని బాధితుల నుంచి మొహం చాటేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలుసుకున్న బాధితులు పీఎస్​ ముందు ధర్నాకు దిగారు.

Gold Trading Investment Fraud in Hyderabad
Gold Trading Fraud in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 5:25 PM IST

Updated : Jun 23, 2024, 7:14 PM IST

Gold Trading Fraud in Hyderabad :గోల్డ్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట హైదరాబాద్‌లో మరో భారీ మోసం జరిగింది. దాదాపు 500 మందిని మోసం చేసి రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 8లో ప్రహణేశ్వర్ ట్రేడర్స్‌ పేరిట రాజేష్‌ అనే వ్యక్తి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించాడు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి, ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకున్నాడు.

చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీ - గూగుల్ పే ద్వారా రూ.96,000 చోరీ - UPI Payment Fraud in Siddipet

ఐదు నెలల్లో పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించాడు. పెట్టిన పెట్టుబడికి లాభాల్లో రెండు శాతం వారానికోసారి ఇస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారందరికి రెండు వారాలు వరుసగా లాభాలు చెల్లించాడు. దీంతో నమ్మకం కలిగిన బాధితులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. వాటిని తీసుకున్న తర్వాత నిందితుడు మొహం చాటేశాడు.

అయితే రెండు వారాల తర్వాత బాధితులకు డబ్బులు రాకపోవడంతో నిందితుడికి కాల్‌ చేయగా అప్పుడు ఇప్పుడు అంటూ మాట మార్చాడు. అలా రెండు నెలలుగా ఎవ్వరికి కనిపించకపోవడంతో కొందరు అతనిపై ఫిర్యాదు చేయగా వారికి కాల్‌ చేసి మళ్లీ పెట్టుబడులు పెట్టాలని దీంతో పాతవాటితో కలిపి అన్ని తిరిగి వస్తాయని వివరించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని ఫోన్‌నంబర్‌ని ట్రేస్‌ చేసి అరెస్టు చేశారు. ఎంతో కష్టపడి పిల్లల పెళ్లిళ్లు, చదువు, సొంత ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు ఇందులో పెట్టుబడిగా పెట్టామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

"గోల్ట్‌ ట్రేడింగ్‌ పేరిట హబ్సీగూడలో రాజేశ్ అనే వ్యక్తి అతిపెద్ద మెసం చేశాడు. దాదాపు 150 కోట్ల స్కామ్ జరిగింది. పెట్టుబడులు పెట్టిన వారందరికి చెక్‌లు ఇచ్చారు కానీ అవన్ని ఫేక్‌ చెక్కులు. నేను దీంట్లో 5లక్షలు పెట్టుబడి పెట్టాను. వేరేవాళ్లు చెప్పడంతో నేను దీంట్లో ఇన్వెస్ట్‌ చేశాను. రెండు వారాల వరకు నాకు దాదాపు 60 నుంచి 70వేల వరకు వచ్చింది. దాని తర్వాత అంతా నేను నష్టపోయాను. మేము ఫిర్యాదు చేయడానికి వెళ్తే కొంతమందికి ఒక రెండు నెలలు నాకు సమయం కావాలని అడిగాడు. మళ్లీ ఫోన్‌ చేసి ఇంకొంత పెట్టుబడి పెడితే పోయిన డబ్బులన్నీ తిరిగి వస్తాయని చెప్పాడు." - బాధితులు

కొరియర్‌ అంటూ లాక్ చేస్తారు - కోట్ల రూపాయల సొమ్ము కాజేస్తారు - Courier Frauds in Telangana

Last Updated : Jun 23, 2024, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details