ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి వరద ఉద్ధృతి - పోలవరం స్పిల్‌వే నుంచి 13.37లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల - Godavari Flood Water Flows - GODAVARI FLOOD WATER FLOWS

Godavari Flood Water Outflows: గోదావరి వరద ప్రవాహం ఉధృతమవుతోంది. ఇవాళ సాయంత్రం వరకూ గోదావరిలో ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరతాయని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఏలూరు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు స్పీల్ వే ఎగువన 32.710 మీటర్లుగా ఉండగా, స్పిల్ వే దిగువన 25.270 మీటర్లు నీటిమట్టం నమోదయింది.

Godavari Flood Water Flows at Polavaram Project
Godavari Flood Water Flows at Polavaram Project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 10:46 AM IST

Godavari Flood Water Flows at Polavaram Project : గోదావరి వరద ప్రవాహం ఉధృతమవుతోంది. ఇవాళ సాయంత్రం వరకూ గోదావరిలో ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరతాయని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 13.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. అది యథాతథంగా ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి జారవిడుస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్​ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గోదావరి వరద ఉద్ధృతి - పోలవరం స్పిల్‌వే నుంచి 13.37లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల (ETV Bharat)

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు : ఎగువ రాష్ట్రాల నుంచి కలుస్తున్న వరద జలాలు కొండ వాగులు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. ఏలూరు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు స్పీల్ వే ఎగువన 32.710 మీటర్లుగా ఉండగా, స్పిల్ వే దిగువన 25.270 మీటర్లు నీటిమట్టం నమోదయింది. కాగా 48 వీడియో గేట్ల ద్వారా 12,36, 855 వరద జలాలను అధికారులు దిగివకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details