GHMC Labour Complaint on Asking Money : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల నుంచి కొంతమంది సిబ్బంది బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు బయటపడింది. జీతం పడగానే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏ)లు ఒక్కో కార్మికుడి నుంచి రూ.500 వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు మహిళా కార్మికులు(Women Workers) జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ వెంకటేశన్ ముందు వాపోయారు.
'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'
ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రోస్, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ సమక్షంలో ఛైర్మన్ వెంకటేశన్ పారిశుద్ధ్య కార్మికులు, కార్మిక సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి అందుతున్న సదుపాయాలు, జీవిత బీమా(Life Insurance), పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
GHMC Safai Karmachari Meeting :ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. తమ జీతాల్లో నుంచి నెల నెల బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, అత్యవసరం ఉండి ఒకరోజు పనికిరాకపోయినా వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్(Goshamahal), బషీర్ బాగ్ ప్రాంతాల్లో ఈ వసూళ్లు అధికంగా ఉన్నట్లు వివరించారు.