ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వార్టర్‌ బాటిల్‌ 99కే - చిల్లర లెక్కలకు చెల్లు - ఫారిన్‌ కిక్కు - NEW LIQUOR PRICES IN ANDHRA PRADESH

భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై చట్టసవరణ - అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ

New Liquor Prices in AP
New Liquor Prices in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2024, 10:17 AM IST

New Liquor Prices in AP :ఏపీలో ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రానుంది. ఈ తరుణంలో భారత్​లో తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) విడుదల చేశారు. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేసింది.

బాటిల్ ఎమ్మార్పీ ధర 150.50గా ఉంటే దాన్ని 160 రూపాయలకి ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర 99కే నిర్ధారించినందున 100 ధరలో 1 రూపాయిని మినహాయించి విక్రయిస్తారని స్పష్టం చేసింది.

మందుబాబుల ఆరోగ్యానికి గ్యారెంటీ! - జే బ్రాండ్‌కు బై బై - ఇక ప్రైవేటు మద్యం అమ్మకాలు - New Liquor Policy 2024 in AP

మొత్తం దరఖాస్తులు 90 వేలపైనే : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర‌్పణకు శుక్రవారంతో గడువు ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఆ సమయానికి 87,986 దరఖాస్తుల అందగా రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 89,643కు పెరిగింది. గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.1800 కోట్లపైనే ఖజానాకు ఆదాయం సమకూరనుంది.

అక్కడ లిక్కర్ లెక్కే వేరు - నూతన మద్యం షాపులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం :ఈ నెల 12,13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన చేశారు. 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీశారు. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి.

ఏపీలో మద్యం దుకాణాలకు 90వేల దరఖాస్తులు! - అత్యధికంగా ఆ జిల్లా నుంచే

ABOUT THE AUTHOR

...view details