తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాంప్​ఫైర్​, యోగా, సైక్లింగ్​ కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారా? - ఇప్పుడు అన్నీ మన హైదరాబాద్​ పార్కుల్లోనే..!

రాజధానికి అల్లుకున్న పచ్చదనం - 21 వేల ఎకరాల్లో నగరం చుట్టూ నిర్మించిన పార్కులు - ప్రాణ వాయువును ప్రసాదిస్తున్న పచ్చదనాలు

Hyderabad Parks
Hyderabad Parks (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Hyderabad Parks :హైదరాబాద్​ మహానగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కాంక్రీట్​ జంగిల్​గా మారిపోతుంది. ఈ క్రమంలో జనం స్వచ్ఛమైన గాలిని గుండెనిండా పీల్చుకునే వీలులేని పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎక్కడ చూద్దామన్న చెట్లు, వనాలు లేకుండా ఎటు చూసిన ఎత్తైన భవనాలు, వాహనాలతో కాలుష్యకారకంగా మారుతోంది. ఈ క్రమంలో రంగారెడ్డి అటవీశాఖ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాప్​ చెప్పాల్సిందే.

పచ్చదనం, ప్రకృతిని పరిచయం చేసేందుకు నగరం చుట్టూ 21 వేల ఎకరాల విస్తీర్ణంలో 26 పట్టణ ఉద్యానాలను నిర్మించారు. దీంతో నగరవాసులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా సేద తీరడానికి వెళ్లవచ్చు. అలాగే వారాంతరాల్లో కూడా ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ఈ 26 ఉద్యానాల్లో 16 పార్కులను అందుబాటులోకి తీసుకు వచ్చారు. మరో 8 పార్కుల్లో పనులు సాగుతున్నాయి. ఈ 26 పట్టణ ఉద్యానాల్లో 47.03 లక్షల మొక్కలు, చెట్లను అధికారులు పెంచుతున్నారు.

రోప్​పై సైక్లింగ్​ చేస్తున్న యువత (ETV Bharat)

ప్లాస్టిక్‌, మద్యం నిషేధం :పట్టణ ఉద్యానాల సంరక్షణే ధ్యేయంగా అధికారులు పలు కఠిన నిబంధనలు విధించారు. వీటిలో మొదటిగా ప్లాస్టిక్​ వస్తువులను ఉద్యానవనాల్లోకి తీసుకురాకుండా నిషేధించారు. ఇందుకు ప్రవేశ ద్వారం వద్దే తనిఖీలు చేస్తున్నారు. ప్లాస్టిక్​ నీళ్ల బాటిళ్లు తీసుకువచ్చిన అనుమతించడం లేదు. అలాగే ఆహార పదార్థాలు ప్లాస్టిక్​ వస్తువుల్లో తీసుకువచ్చినా లోపలికి అనుమతివ్వనే లేదు. అలాగే మద్యపానాన్ని కూడా అస్సలు అనుమతించడం లేదు.

రాశి వనం (ETV Bharat)

ప్రకృతి, పరవశం.. : పట్టణ ఉద్యానాలకు వచ్చే సందర్శకులకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా నగరం చుట్టూ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రకృతి పరిమళాలను పరిచయం చేసేలా వాటిని తీర్చిదిద్దారు. గుర్రంగూడ వద్ద సంజీవని ఉద్యానంలో ఎక్కువగా ప్రాణవాయువును అందించే మొక్కలనే పెంచుతున్నారు.. శంషాబాద్​ సమీపంలోని పంచవటి ఉద్యానంలో రాశీవనం.. నవగ్రహ వనం అనే పేర్లతో అక్కడ ప్రత్యేకంగా ప్రాణవాయువులను ఇచ్చే చెట్లను పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రతీ ఉద్యానవనంగా ప్రత్యేకంగా యోగా కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు.

మసీద్‌గడ్డ పార్కులో సందర్శకుల క్యాంప్‌ ఫైర్‌ (ETV Bharat)

ఉత్సాహంగా ఉల్లాసంగా : అలాగే సంజీవని వనంలో రోప్​వే, సైక్లింగ్​, మసీద్​గడ్డ పార్కులో క్యాంప్​ ఫైర్​, సైక్లింగ్​ అందుబాటులో ఉన్నాది. పార్కు వద్దే సైకిళ్లు ఉన్నాయి. క్యాంప్​ఫైర్​ కోసం వేరేగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పార్కుల్లో చిన్న తటాకాలు, వాటిలో బోట్లు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Dinosaur Park Siddipet : భారత దేశంలో తొలి డైనోసర్ థీమ్​ పార్క్​.. ఎక్కడో తెలుసా..?

పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు వసతులు - సీఎం ఆదేశంతో రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ - TG Govt Focus On Sports grounds

ABOUT THE AUTHOR

...view details