Ganta Srinivasa Rao:తెలుగుదేశం నలుగురు ఎంపీ, 9మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఈ సారి ఎన్నికల బరిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నాలుగో జాబితాలో, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పేరును ప్రకటించింది.
భీమిలి అభ్యర్థిగా గంటా: విశాఖ జిల్లాలో ఎన్నోరోజులుగా ఊరిస్తున్న భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అభ్యర్థిగా టీడీపీ పార్టీ ప్రకటించింది. ఐదో సారి శాసన సభకు విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. తొలుత చోడవరం 2004, అనకాపల్లి 2009, భీమిలి 2014, విశాఖ ఉత్తరం 2019, ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు.
టీడీపీ కొత్త వ్యూహం - మంత్రి బొత్సపై పోటీకి మాజీ మంత్రి గంటా !
సెంటిమెంట్ కు బ్రేక్: గంటా శ్రీనివాసరావు "పోటీ చేసిన నియోజక వర్గం నుంచి మళ్ళీ పోటీ చేయరు" అనే సెంటిమెంట్ కు బ్రేక్ ఇచ్చి గతంలో తాను గెలిచి, మంత్రిగా చేసిన భీమిలి నియోజక వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. 1999-2004 అనకాపల్లి పార్లిమెంట్ సభ్యుడిగా చేసిన ఘనత గంటా శ్రీనివాసరావు కు ఉంది. ప్రస్తుతం మిత్రుడు, తనతో పాటు ప్రజారాజ్యం పార్టీలో అడుగులు వేసిన వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫై భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల బరిలో గంటా శ్రీనివాసరావు నిలబడుతున్నారు.
సీటు రాని ఆశావహులకు చంద్రబాబు హామీ- తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ
భీమిలి సెంటిమెంట్: భీమిలి నుంచి గెలిచినా వారికి పదేళ్ల నుంచి మంత్రి పదవి వరిస్తోంది. 2014 భీమిలి నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు అప్పటి మంత్రి వర్గంలో విద్యా శాఖ మంత్రి గా చేశారు. 2019లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నియోజక వర్గ శాసన సభ్యులు గెలుపొంది మంత్రి వర్గంలో పర్యాటక శాఖ మంత్రి చోటు దక్కించుకున్నారు. మరి ఈ 2024 ఎలా ఉంటుందో ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి- సైకిల్ మాత్రమే ప్రజల్లో ఉండాలి : మాజీ మంత్రి గంటా