తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ టాస్ - డబ్బులు లాస్ -​ జీవితాలు నాశనం చేస్తున్న 'నాణేల ఆట' - GAMBLING GAME WITH COINS IN AP

ఏపీలో చిత్తులాట, ఏటులాటగా జూదం -దీన్ని తీవ్రత తెలిసి దాడులు చేస్తున్న పోలీసులు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 2:27 PM IST

Gambling Game with Currency Coins in AP :దాదాపు పది నుంచి ఇరవై మంది ఓ చోట గుమిగూడి ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున పందెం కడతారు. ఆ డబ్బును బరిలో ఉంచి పోటీపడతారు. వరుసలో ఒకరి తరువాత మరొకరు నిల్చొని రెండు నాణేలను పైకి ఎగురవేస్తారు. నేలపై రెండు బొమ్మల నాణేలు ఎవరికి పడితే వారే విన్నర్​. బరిలో పెట్టిన డబ్బు అంతా అతనికే సొంతం. ప్రస్తుతం ఏపీలో ఈ టాస్​ గేమ్​ పందెం చాపకింద నీరులా విస్తరించిపోతోంది. అయినా ఈ జూదాన్ని నియంత్రించడానికి ఆ రాష్ట్ర పోలీసులకు పెద్ద సవాల్​గా మారింది. ఈ జూదాన్ని ఏటులాటగా లేదా చిత్తులాటగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కాయిన్స్​ గేమ్​గా కూడా అంటున్నారు.

కొన్నిరోజులు క్రితం ఏపీలో గొలుగొండ మండలం అమ్మపేట సమీపంలోని తోటల్లో జరుగుతుందని పందెం పోటీలు జరుగతున్నాయని తెలిసి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడున్న కొందరు పారిపోగా నలగురు చిక్కారు. ఈ ఆట ఎక్కువగా ఏపీలోని అనకాపల్లి-అల్లూరి జిల్లా సరిహద్దుల్లో సాగుతోంది. దీంతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. గొలుగొండ- కొయ్యూరు మండలాల సరిహద్దుల్లో బాలారం-చోద్యం మధ్య తోటల్లోనూ తరచూ జూదం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు మండలాల నుంచి ఈ ఆట కోసం జూదరలు వస్తున్నారు.

కాపలా కూలీకి రూ.600, బిర్యానీ పొట్లం :షణ్ముఖనగర్, గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని, నర్సీపట్నం టౌన్‌ స్టేషన్‌ సమీపంలో వేములపూడి శివార్లలో అప్పుడప్పుడు జూదం జరుగుతోందని సమాచారం. జూదరులు కొన్ని దుకాణాలు వద్ద, చెట్ల కింద వాహనాలను నిలిపివేసి తోటల్లోకి వెళుతుంటారు. పోలీసులు లేదా అనుమానాస్పద వ్యక్తులెవరైనా వస్తున్నారేమోనని వారికి సమచారం ఇచ్చేందుకు అన్ని దారుల్లో కూలీలను కూడా ఉంచుతున్నారు. ఆ కూలీలకు రోజుకు 600 రూపాయలతోపాటు ఒక బిర్యానీ పొట్లం ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూదరులు గంటలోపే ఆట ముగించుకుని జారుకుంటారు. ఈ నెల 18న అమ్మపేటలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల, మాకవరపాలెం మండలం వజ్రగడ, కొయ్యూరు మండలం బాలారం, గొలుగొండ మండల చోద్యానికి నలుగురు నాణేల ఆట ఆడుతూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆటకు వినియోగించిన నాణేలు, రూ.7 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ నాణేల ఆటలో బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులివ్వడానికి కూడా కొందరు వడ్డీ వ్యాపారులు అక్కడే ఉంటున్నారు. నూటికి పది రూపాయల వడ్డీ తీసుకుంటున్నారని సమాచారం. రెండు నెలల క్రితం వరకు గబ్బాడలో ఈ ఆటను వరకు నిరాటంకంగా ఆడేవారు. గ్రామపెద్దలు ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో తరచూ దాడులు చేయడంతో కట్టడి జరిగింది. దీంతో కొన్నిచోట్లు వేల రూపాయలు చేతులో ఉంటేగానీ ఆటకు అనుమతించడం లేదని సమాచారం. ఈ ఆటని వ్యసనంగా మార్చుకున్న గొలుగొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారని వాపోయారు.

నాణేలు ఎగురవేసి ఆడే ఏటులాటని కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని నర్సీపట్నం గ్రామీణ సీఐ ఎల్‌.రేవతమ్మ పేర్కొన్నారు. ఎవరైనా ఆడుతున్నారని తెలిస్తే 100కు కాల్​ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జూదాలు నిర్వహించడం చట్టప్రకారం నేరమని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details