ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు - GAC FRUIT FARMING IN AP

గ్యాక్ ఫ్రూట్‌ పండిస్తున్నయువరైతు - ఉద్యోగం చేస్తూనే సాగు

gac_fruit_farming_for_first_time_in_telugu_states_by_eluru_farmer
gac_fruit_farming_for_first_time_in_telugu_states_by_eluru_farmer (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 1:19 PM IST

GAC Fruit Farming for First Time in Telugu States by Eluru Farmer :ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ పండ్లతోటలు సాగుచేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు రైతన్నలు. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు ఏలూరుకు చెందిన యువరైతు. 'ఫ్రూట్ ఫ్రం హెవెన్' అని పిలిచే ఆ పండును తెలుగునాట పండిస్తున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు. మరి, ఆ అరుదైన పండ్ల జాతి ఏమిటి? దాన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
చూసేందుకు లేత ఎరుపు రంగులో కనిపిస్తుంది ఈ పండు. అది పోషకాల గని. ఔషధ తయారీలో అధికంగా ఉపయోగించే ఫ్రూట్‌ ఇది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రైతుకు ఆదాయం అందిచడంలో గ్యాక్‌ ఫ్రూట్‌కి సాటిలేదు మరే పండు. అది గ్రహించాడీ యువరైతు. విదేశాలకే పరిమితమైన గ్రేట్‌ అమెరికన్‌ కంట్రీ పంట పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.

ఏలూరు జిల్లా మామిడిగొంది వెంకటేశ్‌ స్వగ్రామం. ప్రస్తుతం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే ఇష్టం. అందులోనూ వినూత్నమైన మొక్కలు, పంట రకాలు నాటేందుకు ఆసక్తి చూపేవాడు. అదే మక్కువతో గ్యాక్‌ ఫ్రూట్‌ గురించి తెలుసుకుని సాగు ప్రారంభించాడు.

మనం ఏ వృత్తిలో ఉన్నా అభిరుచిని మరవొద్దు అంటాడు వెంకటేశ్‌. అందుకోసం ఇంటి మందున్న ఖాళీ స్థలంలో 50 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఆదరణ పొందిన గ్యాక్ ఫ్రూట్‌ని పండించాలని అనుకున్నాడు. కేరళలో ఓ రైతు పండిస్తున్నాడని తెలుసుకుని అతడి ద్వారా మొక్కలు సేకరించాడు. అనంతరం అనేక పరిశోధనలు చేసి 2023లో గ్యాక్‌ ఫ్రూట్‌ సాగుచేయడం ప్రారంభించాడు.

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా గ్యాక్​ ఫ్రూట్​ సాగు (ETV Bharat)

'మొక్కలు నాటడం నుంచి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు స్వయంగా నేనే చేస్తాను. అందుకోసం ఆన్‌లైన్‌లో అనేక పద్ధతులు అన్వేషించాను. చేతితో పాలినేషన్ చేయడం ద్వారా పంట దిగుబడి ఎక్కువగా వచ్చి అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దేశంలో కేరళ తర్వాత ఏపీలోనే ఈ పంటను పండిస్తున్నాం.'-వెంకటేశ్‌

గ్యాక్‌ ఫ్రూట్‌ను రసం చేసుకొని తాగొచ్చంటున్నాడీ యువరైతు. ప్రస్తుతం ఈ పండుకు 500 నుంచి 1500 వరకు డిమాండ్‌ ఉందని అంటున్నాడు. అధిక పోషకాలు ఉండటం వల్ల ఈ పండును స్వర్గ ఫలం అని కూడా పిలుస్తారని వివరిస్తున్నాడు. ఈ ప్రూట్ తింటే డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి దరి చేరవని అంటున్నాడు. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీర్ణశక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నాడు వెంకటేశ్‌.

పట్టు విడవని ముగ్గురు మిత్రులు - ఏడాదికి 70 లక్షల బిజినెస్​ - KUSALA HONEY FARMING

గ్యాక్ ఫ్రూట్ అరకిలో నుంచి కిలో బరువుంటుంది. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. క్రమంగా పసుపు, నారింజ, ఎరుపు రంగులోకి మారుతుంది. క్రీమీగా ఉండే గ్యాక్ ఫ్రూట్ గుజ్జు రుచిలో కాస్త తియ్యగా అనిపిస్తుంది. ఇది కాయగా ఉన్నప్పుడు సూప్‌లు, కూరల్లో వేసుకుంటారు. ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకూ కాపునిచ్చే అవకాశం ఉంది.

ఏడాది వ్యవధిలోనే 2సార్లు పంట దిగుబడి సాధించాడీ యువరైతు. పలు రాష్ట్రాల్లో ఉద్యానవన ప్రదర్శనల్లో పాల్గొని అక్కడి రైతులకు గ్యాక్‌ ఫ్రూట్‌ సాగు విధానాలు, పోషక విలువలు, మార్కెట్లో వీటికున్న డిమాండ్‌ను వివరిస్తున్నాడు. డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత ఖరీదైన మెకడేమియాతో పాటు అవకాడో, యాపిల్, అబియూ, డ్రాగన్, కాక్టస్, లక్ష్మణఫలం సాగు చేసేందుకు కడియం నర్సరీ నుంచి మొక్కలను తెప్పించాడు.

అందరిలా కాక వినూత్నంగా ఆలోచించి గ్యాక్‌ ఫ్రూట్ పంట పండిస్తూ ఆదాయం గడిస్తున్నాడు వెంకటేశ్‌. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే పండ్ల సాగుతో యువరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఉద్యోగం​ వద్దనుకుని పొలం బాట పట్టాడు - లాభాలు గడిస్తున్నాడు - YOUNG FARMER EARNING MORE

ABOUT THE AUTHOR

...view details