Robbery Cases in Andhra Pradesh :రాష్ట్రంలోదొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రాష్ట్రంలో మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
SBI ATM Theft in Anantapur :అనంతపురం పట్టణంలోని రాంనగర్ మెయిన్‌రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. మిషన్‌ను ధ్వంసం చేసి రూ.29 లక్షలు దోచుకెళ్లారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న మిషన్ డోర్లను గ్యాస్ కట్టర్‌తో తొలగించారు. ఆ తర్వాత అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో అలారం సిస్టం పనిచేసిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వారు నగదుతో ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Theft Case in Kadapa : కడపలో దొంగతనం చోటుచేసుకుంది. ప్రకాష్‌నగర్‌లో వరలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామమైన చెన్నూరుకు వెళ్లారు. తిరిగి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన వారు తలుపులు తెరచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తెరచి ఉంది. అందులో దాచిన నాలుగున్నర లక్షల నగదు, 10 తులాల బంగారు నగలు చోరికి గురైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెెంటనే బాధితులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.