Former Minister Prathipati Pullarao Son Sarathbabu Arrested:మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో ఆయన్ను విజయవాడ మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ అవెక్సా కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలు జరిగాయని 16 కోట్ల రూపాయల జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలంటూ 2022లో నోటీసులు జారీ చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు విజయవాడ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన భార్య, కుమారుడు, బావ మరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేసింది.
శరత్ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ
పోలీసుల అత్యుత్సాహం:ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థ విచారణ జరుపుతుండగానే రాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం చూపి శరత్‌బాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపేనని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అవెక్సా కార్పొరేషన్‌లో శరత్‌బాబు కనీసం 2 నెలలు కూడా డైరెక్టర్ పదవిలో లేరని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రత్తిపాటి పుల్లారావును అప్రతిష్టపాలు చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్ కాపీలో ఉన్న సంస్థతో శరత్‌బాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన్ను హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కుమారుడు - విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కొద్దిరోజులే డైరెక్టర్‌గా విధులు: నిర్మాణ పనులకు సంబంధించి బీఆర్ఎస్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టులు పొందింది. 2017లో అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టు తీసుకుంది. దీంతోపాటు టాటా ప్రాజెక్ట్ నుంచి ఏపీ డిట్కో ప్రాజెక్ట్ పనులు, ఎన్సీసీ నుంచి మిడ్‌పెన్నా దక్షిణ కాలువ, సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ నుంచి 800 హుద్‌హుద్ ఇళ్ల నిర్మామం పనులను అవెక్సా కార్పొరేషన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమంగా లబ్దిపొందినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
అయితే అవెక్సా కార్పొరేషన్‌కు శరత్‌బాబు 2019 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి 14 వరకు అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే జీఎస్టీ ఎగవేత జరిగిందన్న ఆరోపణలపై మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరి 25న కేసు నమోదైంది. పుల్లారావు కుమారుడు శరత్‌బాబుతోపాటు మిగిలిన డైరెక్టర్లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం అవెక్సా సంస్థకు కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి మాత్రమే డైరెక్టర్, అదనపు డైరెక్టర్లుగా ఉన్నారు. మిగిలిన వారంతా ఆ సంస్థ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆరు నెలల ముందే మంత్రి పారిపోయారు - జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం: ప్రత్తిపాటి
ఆచూకీ లభించక తల్లిదండ్రులు ఆందోళన:ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో శరత్‌బాబును అరెస్ట్ చేసేందుకు 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దిల్లీ, హైదరాబాద్‌లో ఈ బృందాలు మకాం వేశాయి. దిల్లీ వెళ్లిన శరత్‌బాబును అక్కడి నుంచి ఒక బృందం అనుసరిస్తూ హైదరాబాద్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న శరత్‌బాబును విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసి విజయవాడ తరలిచింది. టాస్క్‌ఫోర్స్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ రూం, సీసీఎస్ ఇంటరాగేషన్ సెల్ తదితర ప్రాంతాలకు తిప్పుతూ ఆయన్ను విచారించారు. శరత్‌బాబు ఆచూకీ లభించక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ప్రభుత్వం వేధిస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు కన్నీటి పర్యంతమయ్యారు.
పత్తిపాటిపై జగన్ సర్కార్ కక్ష - కుమారుడి అరెస్ట్