MLA Adluri Laxman on MLA Mallareddy Land Issue : హైదరాబాద్‌లోని పేట్ బషీర్బాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబరు 82కు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి మాదంటే మాదని మాజీ మంత్రి మల్లారెడ్డి, అవతలి వర్గం వారు వాదిస్తున్నారు. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులు కంచెను కూల్చడం ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు దారి తీయగా రంగంలోకి దిగిన అధికారులు సర్వే నంబరు 82 భూమిలో సర్వే చేపట్టారు. బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు.
సర్వే నంబరు 82లో ఉన్న భూమి మొత్తం తమదేనని మాజీ మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భూమిని 15 ఏళ్లు క్రితం కొనుగోలు చేశామన్నారు. ఈ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ట్యాక్స్‌లు కడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తనపట్ల వివక్ష చూపుతుందని తెలిపారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ సైతం ఎనిమిది నెలలుగా తన దగ్గరకు వచ్చి ఈ తతంగా నడుస్తోంది. ఎమ్మెల్యే అయిన తనకే భద్రత లేకపోతే సామాన్యులకు ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమది తప్పుంటే ఆ భూమిని వాళ్లనే తీసుకోమని మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
"ఈ భూమిని 15 ఏళ్లు క్రితం కొనుగోలు చేశాం. ఈ భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయి. అలాగే ఎప్పటికప్పుడు ట్యాక్స్‌లు కడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తన పట్ల వివక్షను చూపుతుంది. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ సైతం నుంచి ఎనిమిది నెలలుగా ఈ తంతు నడుస్తోంది. తమది తప్పుంటే ఆ భూమిని వాళ్లనే తీసుకోమని చెప్పండి."- మల్లారెడ్డి, మాజీ మంత్రి