తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్ విచారణలో రాధాకిషన్‌రావుకు అస్వస్థత- నిలకడగానే ఆరోగ్యం - phone tapping case updates - PHONE TAPPING CASE UPDATES

Phone Tapp Case in Telangana : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, రెండో రోజు విచారించారు. ఉదయం పది గంటల నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. మధ్యాహ్నం సమయంలో రాధాకిషన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు అధికం కావడంతో, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వైద్యులను బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వైద్యులు ఆయనకు ఈసీజీతో పాటు రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు. రాధాకిషన్‌రావుకు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

EX DCP RADHAKISHAN RAO FELL ILL
Phone Tapping Case Updates

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:41 PM IST

Phone Tapping Case Updates :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు బృందం, ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నేతల ఫోన్లపై, ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ట్యాపింగ్‌ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ అనంతరం వీరి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు బృందం అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు - Telangana Phone Tapping Case

మరోవైపు దర్యాప్తు బృందం, రాధాకిషన్‌రావును విచారిస్తుండగా రక్తపోటు అధికం కావడంతో ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు ఈసీజీతో పాటు రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేయకముందు అందులో ఉన్న డేటాను ఎందులో అయినా నిక్షిప్తం చేశారా? ఎవరు ఒత్తిడితో ఈ తంతంగం నడిపారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్‌ చేశారు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు? వంటి కోణాల్లో రాధాకిషన్‌రావు దర్యాప్తు బృందం విచారిస్తున్నట్టు సమాచారం.

గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో, ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఆ వివరాలను రాధాకిషన్‌రావుకు అందజేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈఘటన జరిగిన వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్స్‌ ఎవరు చెబితే ఏర్పాటు చేశారు, అనే విషయంలోనూ దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాధాకిషన్‌రావు తమను బెదిరించాడంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో వాటిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. రెండు రోజుల పోలీసు కస్టడీలో రాధాకిషన్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా, మరికొంత మందికి దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

EX DCP Radhakishan rao Bail Petition Dismissed :మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు రాధాకిషన్‌రావు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల హడావుడిలో ఉండడం వలన ఆయనకు భద్రతతో కూడిన బెయిల్‌ కల్పించలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎంలో పరీక్షలు తర్వాత రాసుకోవచ్చని పోలీసుల తరపును ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాధాకిషన్‌రావు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించింది.

ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు - TS Phone Tapping Case

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై తొలిసారి స్పందించిన హైదరాబాద్​ సీపీ - ఏమన్నారంటే? - Hyderabad CP on PhoneTapping Case

ABOUT THE AUTHOR

...view details