ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొరకని చిరుత - రెండ్రోజులుగా కన్పించని ఆనవాళ్లు - Leopard in Kadiyam Nursery

Leopard Roaming in Kadiyam Nursery : తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ చిరుత కొనసాగతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని డీఎఫ్​ఓ ప్రసాదరావు వివరించారు. వర్షం వల్ల దాని పాదముద్రలు నమోదు కావడం లేదన్నారు. చిరుతకడియపులంక నర్సరీల నుంచి గోదావరి లంకల వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ప్రసాదరావు వెల్లడించారు.

Leopard Spotted East Godavari District
Leopard Spotted East Godavari District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 7:25 PM IST

Leopard Spotted East Godavari District :తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్నిరోజులుగా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మొదట రాజమహేంద్రవరం సమీప దివాన్‌చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత తాజాగా కడియం, గోదావరి లంకల్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలోనే లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అది ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమవుతూ ప్రజలకు సూచనలు జారీచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఎఫ్ఓ ప్రసాదరావు పేర్కొన్నారు. వర్షం వల్ల చిరుత పాదముద్రలు నమోదు కావడం లేదని చెప్పారు. అది కడియపులంక నర్సరీల నుంచి గోదావరి లంకల వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాని కోసం 4 బోన్లు, 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Leopard Active in Kadiyam Nurseries :చిరుత కనిపిస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రసాదరావు తెలిపారు. దాని కదలికలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నామని చెప్పారు. సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. చిరుత గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని సూచించారు. కానీ కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలాంటి వాటిని నమ్మవద్దని ప్రసాదరావు సూచనలు చేశారు.

గ్రామాల్లో ఆందోళన : మరోవైపు కడియం శివారుతో పాటు బుర్రిలంక, దోశాలమ్మకాలనీ, వెంకాయమ్మపేట, కడియపులంక, పొట్టిలంక, వీరవరం తదితర గ్రామాల్లో చిరుత ఉనికితో ఆందోళన కొనసాగుతోంది. వివిధ పనులపై వెళ్లేవారు రాకపోకలు సాగించేందుకు భయాందోళనకు గురవుతున్నారు. కాగా సంవత్సరం పాటు పెంచి పోషించిన నర్సరీలలోని మొక్కలను విక్రయించే సమయమిది. ఈ దశలో చిరుత సంచారంతో వాటి ఎగుమతులు, దిగుమతులు నిలిచాయి. ఇది అన్నదాతలపైనే గాక లారీ యజమానులపైనా ఆర్థికంగా ప్రభావం చూపుతోంది.

దాగుడుమూతల చిరుత - ఎక్కడుందో ! ఏమైందో? - Leopard Active at Diwancheruvu

కొనసాగుతున్న చిరుత వేట - డ్రోన్‌ కెమెరాలతో నిఘా - Leopard In Kadiyam Nursery

ABOUT THE AUTHOR

...view details