TTD is a key decision For Locals :టీటీడీ నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంలో భాగంగా స్థానికులకు ఒక రోజు దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టింది. స్థానికులకు డిసెంబర్ 3వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది. స్వామి వారి దర్శనం కోసం స్థానికులకు టోకెన్లు పొందే ఏర్పాటు చేసింది.
తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లో స్థానికులు ఈ టోకెన్లు పొందే అవకాశం కల్పించింది. వారికి డిసెంబర్ 2వ తేదీన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుమల స్థానికులు టోకెన్లు పొందేందుకు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతి వాసులకు మహతి ఆడిటోరియంలో కౌంటర్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 2న ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నామని టీటీడీ పేర్కొంది.