ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సికింద్రాబాద్​ అల్ఫా హోటల్​లో భోజనం చేస్తున్నారా? - కాస్త ఆలోచించాల్సిందే బాస్ - SECUNDERABAD ALPHA HOTEL FINED - SECUNDERABAD ALPHA HOTEL FINED

Food Safety Officials Fined Alpha Hotel : సికింద్రాబాద్‌లో షాపింగ్ కోసమో ఇతర ఏ పనిమీద వెళ్లినప్పుడైనా కాస్త ఆకలేసిందంటే అందరి చూపు వెళ్లేది అల్ఫా హోటల్‌పైనే. అక్కడ టేస్టీఫుడ్ అతి తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువ మంది అక్కడే భోజనం చేయడానికి మక్కువ చూపిస్తారు. అందుకే అల్ఫా హోటల్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలా మీరు కూడా సికింద్రాబాద్ వెళ్లినప్పుడు అల్ఫా హోటల్‌లోనే భోజనం చేస్తున్నారా? ఐతే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

food_safety_officials_fined_alpha_hotel
food_safety_officials_fined_alpha_hotel (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 2:27 PM IST

సికింద్రాబాద్​ అల్ఫా హోటల్​లో భోజనం చేస్తున్నారా? - కాస్త ఆలోచించాల్సిందే బాస్ (ETV Bharat)

Food Safety Officials Raids in Alpha Hotel : సికింద్రాబాద్​లోని ఆల్ఫా, రాజ్​ బార్​ అండ్​ రెస్టారెంట్​, సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు. రెండు రోజలు క్రితం తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇవాళ వాటికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆహారాన్ని ఫ్రిజ్​లో పెట్టి వేడి చేసి కస్టమర్లకు : సికింద్రాబాద్​లోని ఆల్ఫా హోటల్​లో టాస్క్​ఫోర్స్​ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్​తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్​లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ హోటల్​తో పాటు సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్​లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు.

హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఆల్ఫా హోటల్​లో తయారు చేసే బ్రెడ్​తో పాటు ఐస్​క్రీమ్ వంటివి ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆల్ఫా హోటల్​కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు.

Food Safety Officials Imposed Fine in Alpha Hotel (ETV Bharat)

బడా రెస్టారెంట్​లో ఫుడ్​ భలే టేస్టీగా ఉంటుందని వెళ్తున్నారా? - ఐతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - hotel FOOD IN HYDERABAD

సికింద్రాబాద్​కు రోజుకూ వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు. అక్కడ హెటల్​ బిజినెస్​ బాగా నడుస్తుంది. అక్కడికి షాపింగ్ కోసం వచ్చే వారు, ఇతర పనులు మీద వెళ్లిన వారు, ముఖ్యంగా విద్యార్థులు ఆల్ఫా హోటల్​లో తినడానికి ఇష్టపడుతుంటారు. ఆ హోటల్​లో విక్రయించే బేకరీ వస్తువులు, బిర్యానీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుందని ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగా ఉంటుంది. అయితే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు బెంబేేలేత్తిపోతున్నారు. తాము ఎప్పుడూ తినే హోటల్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిసి భయపడి పోతున్నారు.

ప్రజల అవసరాలే ఆసరాగా :ఇటీవల ఆహార భద్రతా అధికారులు హోటళ్లలో కొరజా ఘుళిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తూ సీజ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్​కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహారపదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయట ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా ఫర్వాలేదు ఇంటికెళ్లి వండుకుని తినాలి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది.

ఏంతింటున్నామో తెలుసా? - వాస్తవాలు తెలిస్తే వాంతులే! - hotel food

ABOUT THE AUTHOR

...view details