Flying Squad Seized YSRCP Gifts in Renigunta :ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార వైసీపీ పన్నిన కుట్ర బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు ఎరవేసేందుకు గోదాముల్లో భద్రపరిచిన వందల కోట్ల రూపాయల విలువైన తాయిలాలు బయటపడ్డాయి. రేణిగుంట అంతర్జాతీయ విమానశ్రయ సమీపంలోని 5 గోదాముల్లో వీటిని భద్రపరిచినట్లు అధికారులు గుర్తించారు. మునుపెన్నడూ లేనిరీతిలో అధికార వైసీపీ పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన తాయిలాలు బయటపడటం కలకలం రేపుతోంది.
వంటపాత్రలు, వినోద సాధనాలు, అలంకరణ వస్తువులు, విలువైన చీరలు ఇలా ఒక్కటేమిటి మనిషి జీవనానికి అవసరమైన అన్ని రకాల వస్తువులతో కూడిన తాయిలాలను సగటు సాధారణ ఓటరు ముగింటకు చేర్చేందుకు వైసీపీ చేసిన కుట్రలు భయటపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలోని ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసిన 52 రకాల వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. ఓటర్లకు పంచేందుకు మంగళవారం మధ్యాహ్నం రామకృష్ణాపురం గోదాముల నుంచి వస్తువులను తరలిస్తున్న ఓ లారీపట్టుబడటంతో వైసీపీ ప్రలోభాలపర్వం గుట్టు బయటపడింది.
సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటెయినర్- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? - Suspected Container Vehicle
వస్తువులను దాచి ఉంచిన గోడౌన్ తెరిచేందుకు కొంత హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తహసీల్దారు ఘటనా స్థలానికి రాకపోవడంతో గోడౌన్ తెరిచేందుకు వీలు పడలేదు. లారీని పట్టుకున్న తర్వాత పంచనామా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రేణిగుంట తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. 5 గంటల తర్వాత ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ఒత్తిడితోనే ఆలస్యంగా చేరుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఆ తర్వాత గోదాములు తెరిచేందుకు తాళాలు లేవంటూ తాత్సారం చేశారు. టీడీపీ నాయకులు నిరసన చేపట్టడంతో రాత్రి 8గంటల సమయంలో గోదాము తెరిచారు. లోపల దాచిన వందల కోట్ల రూపాయల విలువైన వస్తువులు బయటపడ్డాయి. గోదాములో దొరికిన పుస్తకాలలో గత 2 నెలలుగా తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, కొండెపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ్యుల పీఏలకు చేర్చినట్లుగా అందులో పొందుపర్చారు.