తెలంగాణ

telangana

ETV Bharat / state

బిర్యానీ రేటు కంటే తక్కువ ధరకే హైదరాబాద్​ టు బెంగళూరు - ఛాన్స్​ మిస్సవ్వకండి - Flixbus Announce Low Cost Journey - FLIXBUS ANNOUNCE LOW COST JOURNEY

Flixbus Announce Good news : బెంగుళూరు- హైదరాబాద్​ ప్రయాణించే వారికి ఫ్లిక్స్​బస్ సంస్థ శుభవార్త అందించింది. ఇరు నగరాలకు ప్రయాణించే వారికి రూ. రూ.99తో టికెట్‌ బుక్‌ చేసుకునే ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. టికెట్​ బుకింగ్ టైమింగ్స్​, ప్రయాణ తేదీలను ప్రకటించింది.

Flixbus Announce Low Cost Journey
Flixbus Announce Good news (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 2:31 PM IST

Flixbus Announce Low Cost Journey : ఏసీ బస్సులో మన రాష్ట్రంలోని పట్టణాలకు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతున్న నేటి సమయంలో, ఇక అంతరాష్ట్ర సర్వీసులు హైదరాబాద్- బెంగళూరు అంటే ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్లిక్స్​బస్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.99కే హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రయాణికులకు అందుబాటు ఛార్జీలతో, స్థిరమైన రవాణాకు అంతర్జాతీయ బ్రాండ్‌గా ఉన్న ఫ్లిక్స్‌బస్‌ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై మార్గాల్లో బస్సులను కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక మంత్రి ఎంబీ పాటిల్‌ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్లోబల్‌ ఫ్లిక్స్‌ సీఓఓ మ్యాక్స్‌ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్‌ క్రాస్‌ పాల్గొన్నారు. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్‌ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా రూ.99తో టికెట్‌ బుక్‌ చేసుకునే ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని, ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11-అక్టోబరు 6 మధ్య ఉండాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details