తెలంగాణ

telangana

ETV Bharat / state

జానీ మాస్టర్​ కేసులో కొత్త ట్విస్ట్ - పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు - Joni Master rape case Latest News - JONI MASTER RAPE CASE LATEST NEWS

Joni Master Latest News : అత్యాచారం కేసులో డ్యాన్స్​ మాస్టర్​ జానీ మాస్టర్​కు బిగ్​ షాక్ తగిలింది​. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో యాక్ట్​ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్​గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్​ తనపై లైంగికంగా దాడి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది.

Joni Master Latest News
Joni Master Latest News (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 5:54 PM IST

POCSO Act on Joni Master : ప్రముఖ డాన్స్​ మాస్టర్​ జానీ మాస్టర్​పై పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు అయింది. మైనర్​గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో తనపై అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్​ను ఎఫ్​ఐఆర్​లో యాడ్​ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.

జానీ మాస్టర్​ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల ఆయన అసిస్టెంట్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. '2017లో జానీ మాస్టర్​ పరిచయం అయ్యారు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరి, అదే ఏడాది ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం అక్కడికి వెళ్లాను. తనతో పాటు మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్​లో నాపై జానీ మాస్టర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మరి డ్యాన్స్​ చేయవని బెదిరించాడు. సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని లొంగదీసుకున్నాడు.

దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్​ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లినప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్​ సమయాల్లోనూ వ్యానిటీ వ్యాన్​లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆయన వేధింపులు భరించలేకే జానీ మాస్టర్​ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా తన పని చేసుకోకుండా అడ్డు పడుతున్నారు. ఇతర ప్రాజెక్టులు రాకుండా చేస్తున్నారు.' అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి కేసును నార్సింగికి రాయదుర్గం పోలీసులు బదిలీ చేశారు.

యువతిపై లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​గా పనిచేస్తున్న యువతిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. ఆ యువతిపై ఐదేళ్లపాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది లవ్​ జిహాద్​ కేసుగా ఆమె పేర్కొన్నారు. హిందూ అమ్మాయిని ట్రాప్​ చేసినట్లుగా స్పష్టంగా ఎఫ్​ఐఆర్​లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.

'జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు - ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది' - RAPE CASE AGAINST JANI MASTER

లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్​కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్ - JANI MASTER CONTROVERSY

ABOUT THE AUTHOR

...view details