Film Industry Condolence to Ramoji Rao : చిత్రపరిశ్రమలో రామోజీ రావు తనదైన ముద్ర వేశారని సినీ ప్రముఖులు కొనియాడారు. రామోజీరావు ఓ మానవ రత్నమని పత్రికా ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. పత్రిక ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించారని వివరించారు. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు.
రామోజీరావు మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు అని, రాష్ట్రం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సినీ పరిశ్రమలు చెందిన పలువురు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. ఎంత ఎదిగిన నేల మీద నడిచే వ్యక్తి అని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు.
Senoir Movie ActorsCondolence to Ramoji Rao : ఫిల్మ్‌సిటీకి వెళ్తే సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల కోసం వారందరి తరపున పోరాటం చేసింది ఆయనేనని కే.ఎస్ రామారావు అన్నారు. తమ అమ్మా నాన్న రామోజీ సంస్థలైన ప్రియా పచ్చళ్ల కంపెనీలో పని చేసే వారని, పత్రికా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన రామోజీ మహనీయుడని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని, పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఎన్నో విప్లవాలకి ఊపిరి లూధారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రవి అన్నారు.