ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిరోడ్డుపై జంతువుల భీకర పోరు - భయంతో వణికిపోయిన వాహనదారులు - SNAKE AND MONGOOSE VIRAL VIDEO

నడిరోడ్డుపై నాగుపాము - ముంగిస మధ్య పోరు - భయంతో వాహనాలు ఆపేసి చూస్తూ అలాగే ఉండిపోయిన వాహనదారులు - పైచేయి ఎవరిదంటే!

Snake And Mongoose Fight  Video
Snake And Mongoose Fight Video (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 1:11 PM IST

Snake And Mongoose Fight Video :పాము - ముంగిస మధ్య జాతివైరం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు జంతువులు ఎదురుపడితే చాలు కొట్లాడుకోకుండా ఉండవు. వాటి మధ్య ఉన్న వైరం అలాంటింది. ప్రత్యేకంగా వీటి మధ్య వైరం లేకపోయినా పాము, ముంగిస ఆహారం కావడంతో ఈ పోరాటం మొదలవుతుంది. సాధారణంగా మనం పాములు చాలా వేగంగా స్పందిస్తాయని అనుకుంటాం కానీ ముంగిసలు పాముల కంటే వేగంగా స్పందిస్తాయి. అందుకే చాలా పోరాటాల్లో ముంగిసలదే పైచేయి అవుతుంది. కొన్ని సందర్భాల్లో పాములు తప్పించుకోవడం కూడా కనిపిస్తుంది.

కనపించడమే ఆలస్యం :ఇంతకీ ఈ స్టోరీ అంతా ఎందుకంటే ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడలో జరిగింది. రోటిగూడలో రహదారిపై పడగ విప్పిన నాగుపామును చూసి వాహనదారులు తమ వాహనాలను నిలిపేసి భయంతో చూస్తూ ఆగిపోయారు.

Cat Fights Snake In Anantapur రోడ్డుపై పాము పిల్లి పోరాటం... గెలుపెవరిదంటే?

ఇదే సమయంలో పాముకు ఎదురుగా ఓ ముంగిస వచ్చింది. ఇంకే ముంది ఎదురుగా పాము పడగ విప్పి మరీ కనిపించేసరికి ముంగిస పోరుకు సిద్ధమైంది. రెండు జంతువుల మధ్య కొన్ని సెకన్ల పాటు ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో ముంగిసదే పైచేయిగా కనిపించింది. ఓ దశలో పాము తప్పించుకునేందుకు ప్రయత్నించినా ముంగిస వదల్లేదు. చివరకు ముంగిస బలం, నేర్పు, వేగం ముందు పాము నిలవలేకపోయింది. ముంగిస పామును చంపి నోట్లో కరుచుకొని పొదల్లోకి వెళ్లింది. ఈ అరుదైన ఘటనను గ్రామస్థులు, వాహనదారులు తన సెల్​ఫోన్​లలో వీడియో తీయడంతో ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

లయన్స్​ Vs డాగ్స్- గోశాల వద్ద పెద్ద ఫైట్- సింహాలను తరిమికొట్టిన కుక్కలు - Lions Vs Dogs Viral Video

పాము, శునకం మధ్య భీకర పోరు.. చివరకు రెండు మూగజీవాలు..!

ABOUT THE AUTHOR

...view details