TGSRTC Buses for Sankati Festival : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై రంగారెడ్డి రీజీనల్ మేనేజర్ శ్రీలత ఈటీవీ భారత్కు వివరించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా 6500ల బస్సులను నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 7 నుంచి 13 వరకూ వీటిని నడుపుతాం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, ఒంగోలు, కందుకూరుకు డిమాండ్ బాగా ఉంది. అందువల్ల మొత్తంగా 400ల బస్సులను నడిపేందుకు ప్రణాళికలు వేశాం- శ్రీలత, రీజీనల్ మేనేజర్ రంగారెడ్డి