Father Killed Child Because She Born With Black at Palnadu: కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే కాలయముడైయ్యాడు. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. నల్లగా పుట్టిందనే కారణంతో ముక్కు, నోరు మూసి ఊపిరందకుండా చేసి చిన్నారిని హత్యచేశాడని చిన్నారని తల్లి ఆరోపిస్తోంది. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి
మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని పేటసన్నెగండ్లకు చెందిన మహేష్‌కు మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 18 నెలల కిందట అక్షయ అనే కుమార్తె జన్మించింది. బిడ్డ నల్లగా పుట్టిందని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు తరచూ హింసించేవారని, కనీసం ఆ పాపను దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదని శ్రావణి పేర్కొన్నారు.
అత్తింటివారు వేధింపులు గురిచేసినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని శ్రావణి తెలిపారు. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున అక్షయ ముక్కు వెంట రక్తం కారుతూ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన శ్రావణి వెంటనే అప్రమత్తమైంది. భర్త మహేష్, అత్తమామలను చెప్పడంతో వెంటనే ద్విచక్రవాహనంపై చిన్నారిని తీసుకుని కారంపూడిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని శ్రావణి తెలిపారు. మృతదేహాన్ని తీసుకుని భర్తతో కలిసి ఇంటికి వస్తున్న క్రమంలో అక్షయ ఫిట్స్‌తో చనిపోయినట్టుబంధువులకు చెప్పాలని లేకపోతే చంపేస్తాని భర్త హెచ్చరించినట్టు శ్రావణి తెలిపారు.