Farmer Vice President Venkaiah Naidu Speech in Alumni Meeting :దేశం శక్తిమంతంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోరాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల(Govt Junior College) 1972- 74 ఇంటర్మీడియట్ బ్యాచ్ స్వర్ణోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ హైదరాబాద్లోని మణికొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
నా 'పద్మవిభూషణ్' రైతులు, మహిళలు, యువతకు అంకితం : వెంకయ్యనాయుడు
ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, చదువు నేర్పిన గురువులను, మాతృభాషను, మాతృదేశాన్ని, స్నేహితులను మరువరాదు అని స్పష్టం చేశారు. నేటి తరానికి విద్యతో పాటు విలువలు నేర్పించడం ఎంతో ముఖ్యం అని అన్నారు. విజ్ఞానంతో పాటు ప్రాపంచిక జ్ఞానం కూడా నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు ప్రాపంచిక జ్ఞానాన్ని నేర్పించే బాధ్యతను ఇంటిలో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వంటి పెద్దలు తీసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
Venkaiah Naidu Attend Alumni Celebrations at Hyderabad :కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే, పిల్లలు సంపూర్ణంగా ఎదుగుతారని అప్పుడే దేశం కూడా శక్తిమంతంగా తయారవుతుందని ఆయన ఆకాంక్షించారు. మాతృభాషలోనే విద్యా బోధన(Educational Teaching) ఉండాలి. ఆంగ్ల భాషపై మోజును వదలాలన్నారు. బ్రిటిష్ వారి వలస పాలన కారణంగా మనదేశంలో భాషను, వారి భావనలను బలవంతంగా రుద్దారన్నారు. ఉద్యోగం కావాలంటే ఆ భాషను నేర్చుకోవాలి అని అలవాటు చేశారు.