ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏనుగుల దాడిలో రైతు మృతి - మామిడితోటలో తిష్ఠవేసిన గుంపు

జనావాసాల్లో అడవి జంతువుల సంచారం- బిక్కుబిక్కుమంటున్న జనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

farmer_killed_by_elephant_herd_attack_in_annamayya_district
farmer_killed_by_elephant_herd_attack_in_annamayya_district (ETV Bharat)

Farmer Killed By elephant herd Attack In Annamayya District :అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లో సంచరించడం, స్థానికులు భయాందోళన చెందడం సర్వసాధారణమైంది. ఈ విధంగా అడవి జంతువులు జనావాసాల్లోకి చేరి సాధు జీవాలను చంపితిన్న ఘటనలు లేకపోలేదు. చిరుత, ఎలుగు దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు.

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కొత్తపల్లిలో ఏనుగుల గుంపు దాడిలో ఓ రైతు మరణించాడు. కాకులారంపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన రాజారెడ్డి (55) ఉదయాన్నే పొలానికి వెళ్తుండగా తనపై ఏనుగులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి. పీలేరు పట్టణ కేంద్రానికి కూతవేటు చిత్తూరు జిల్లా పులిచెర్ల అటవీ ప్రాంతం నుంచి పీలేరు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఓ మామిడి తోటలోకి 15 నుంచి 20 ఏనుగులు చొరబడ్డాయి.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజరాజులు ఆహారం తిని నిద్రిస్తున్నాయని, చీకటి పడ్డాక అడవుల్లోకి వెళ్లగొట్టాలని యోచిస్తున్నట్లు వారు తెలిపారు. ఏనుగులు గుంపు కనిపిస్తే వాటికి ఎదురు వెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా ఏనుగులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పంటపొలాలపై పడి, అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

ఆహారం కోసం వచ్చి నదిలో చిక్కుకున్న ఏనుగు- గంటపాటు అవస్థలు - Elephant stuck in river

ఇటీవల చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. పీఎంకే తండాకు చెందిన ఓ రైతుపై పొలం నుంచి ఇంటికి వస్తుండగా దాడి చేసింది. దాడిలో రైతు కన్నానాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కన్నానాయక్ మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పంట భూముల్లో ఏనుగులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఏనుగులు రైతులపై దాడులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ ఎలుగుబంటి వచ్చింది - చీకటి పడితే భయపడుతున్న ప్రజలు - Bears hulchul in Kalyanadurgam

ABOUT THE AUTHOR

...view details