Farmer Agitation At MRO Office:ఎన్నో ఎళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించడంతో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టారు. దీంతో రైతు ఆందోళన చూసి అధికారులు, అక్కడున్న ప్రజలు షాక్కు గురయ్యారు. తన సమస్యను పరిష్కరిస్తామంటూ అధికారులు దిగొచ్చారు.
ఇదీ జరిగింది: పూర్వీకుల నుంచి తన కుటుంబానికి సంక్రమించిన భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించారంటూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతుకుతూ నిరసన తెలియజేశారు. శ్రీ సత్య సాయి జిల్లా కాలసముద్రం రెవెన్యూ గ్రామంలో రైతు గంగులప్పకు పెద్దలనుంచి భూమి సంక్రమించింది.
Farmer washed clothes at MRO Office: వైఎస్సార్సీపీ నాయకుడు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తమ అధీనంలో ఉన్న భూమిని మరొకరికి హక్కు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారని రైతు గంగులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రెవెన్యూ పోలీసు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతికి, అక్కడే ఆర పెట్టారు.