Fake Currency Supplied Gang Arrest:నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న ముఠాను ఏలూరు త్రీ టౌన్, సీసీఎస్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కె.రత్న శివ కిషోర్ మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:ఏలూరుకు చెందిన దొండపాటి ఫణి కుమార్ అనే వ్యక్తి 108 అంబులెన్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. గత నెల 28వ తేదీన ఒక వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద రూ.44 లక్షల నకిలీ కరెన్సీ ఉందని, తమకు రూ.10లక్షలు ఇస్తే రూ.44 లక్షలు ఇస్తానని ఆశ చూపించారు. తన వద్ద అంత డబ్బులు తన వద్ద లేవని చెప్పగా చెప్పగా ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వమని ఫణి కుమార్‌కు ఆ ముఠా సభ్యులు చెప్పారు.
అనుకున్నట్లుగానే ఫణికుమార్ ఆ ముఠాకు మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు కూడా రెడీ చేసుకోమని ఆ ముఠా సభ్యులు ఫణికుమార్‌కు చెప్పారు. ఈ విషయంపై ఫణికుమార్ తన స్నేహితులతో చెప్పడంతో ఇలాంటివాటిని నమ్ముకూడదని, మోసం చేస్తారని చెప్పారు. దీంతో వెంటనే ఫణి కుమార్ ఏలూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మిగిలిన డబ్బులు కూడా ఇస్తామని రప్పించి ఎంతో చాకచక్యంగా దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.