ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాదగిరిగుట్టలో భారీ పేలుడు - ఒకరు మృతి - PEDDAKANDUKUR EXPLOSION TODAY

యాదగిరిగుట్ట మండలంలోని పరిశ్రమలో పేలుడు - ఒకరు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

Explosion at Premier Explosives Industry in Telangana
Explosion at Premier Explosives Industry in Telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 11:28 AM IST

Peddakandukur Explosion Today :తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌క్లూజివ్‌ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అప్రమత్తం చేసింది.

ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటానా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బచ్చన్నపేటకు చెందిన ఎం.కనకయ్య మృతి చెందాడు. మరో కార్మికుడు ప్రకాశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details