తెలంగాణ

telangana

ETV Bharat / state

గూగుల్​లో కనిపించే వెబ్​సైట్​ అసలైందా? నకిలీదా? - ఇలా ఈజీగా గుర్తించండి - IDENTIFY FAKE WEBSITE

గూగుల్​లో నకిలీ వెబ్​సైట్లు - గమనించకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కినట్లే!

fake websites on google
Identify fake website (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 8:51 AM IST

Updated : Jan 21, 2025, 8:56 AM IST

Identify fake website On Google : ఈ రోజుల్లో ఏం కావాలన్నా గూగుల్​లో వెతుకుతుంటారు. మన ఇంట్లో ఏవైనా కొత్తగా కొన్న వస్తువులు రిపేరుకు వస్తే (టీవీ, వాసింగ్ మిషన్) వాటి తయారీ సంస్థ కస్టమర్ నెంబర్ కోసం వెతుకుతుంటాము. ఏదైనా ఫోన్ తక్కువ ధరలకు కావాలన్నా వెబ్​సైట్​లో సెర్చ్ చేస్తాం. బస్సు టికెట్ బుకింగ్ రద్దు చేసుకోవడానికీ గూగుల్​లో సంస్థ పేరు టైప్ చేసి దానికి సంబంధించిన నంబర్ కనబడగానే దానికే ఫోన్ చేస్తాం. ఇలా నేరుగా ఆన్​లైన్​లో దొరికిన నంబర్లను సంప్రదించి ఏటా వేలాది మంది సైబర్ నేరాల బారినపడి రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు.

దీనికి ప్రధాన కారణం నకిలీ వెబ్​సైట్. పండుగ సమయాల్లో ఈ-కామర్స్ వెబ్​సైట్ల పేరుతో మోసాలు జరిగినా కేఎఫ్​సీ, ద్విచక్ర వాహనాలు, కార్ల షోరూం డీలర్ షిప్ మోసాలకూ ఈ నకిలీ వెబ్​సైట్లే కారణం. ఈ నకిలీ, నిజమైన వెబ్​సైట్లను గుర్తించడం తేలికే. కొద్దిపాటి అవగాహన, చిన్నపాటి జాగ్రత్తలతో సైబర్ నేరాల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నకిలీ వెబ్‌సైట్‌ తెరిచినప్పుడు ప్యాడ్‌లాక్‌ మీద క్లిక్‌ చేస్తే ఇలా కనిపిస్తుంది (ETV Bharat)

నకిలీ వెబ్​సైట్​ను గుర్తించడి ఇలా

  • ఆన్​లైన్​లో ఏదైనా సంస్థ గురించి వెతికినప్పుడు పదుల సంఖ్యలో వెబ్​సైట్లు దర్శనమిస్తాయి. ఇందులో అసలుది తెలుసుకోవడానికి సంస్థ పేరుతో ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి. అక్షరాల్లో ఏ మాత్రం తేడా ఉన్న నకిలీదని గుర్తించాలి.
  • అసలు వెబ్​సైట్ ఏదైనా https:// ఇలా ఉండి, ఆ తర్వాత సంస్థ పేరుతో ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇవి లేకుంటే అనుమానించాలి.
  • వెబ్‌సైట్‌ అసలైనదేనని ఒక అంచనాకు రాకపోతే డొమైన్‌ తనిఖీ చేయాలి. నేరగాళ్లు ఉపయోగించే వెబ్‌సైట్లు కొద్దికాలం కోసమే తయారు చేస్తారు. ఇటీవలే వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు కనిపిస్తే అనుమానించాల్సిందే.
  • బ్రాండెడ్‌ సంస్థల వెబ్‌సైట్‌ తెరిచినప్పుడు పైన అడ్రస్‌ బార్‌/ యూఆర్‌ఎల్‌ బార్‌ ప్రారంభంలో కనిపించే ప్యాడ్‌లాక్‌ (రెండు అడ్డ గీతలుంటాయి) మీద క్లిక్‌ చేస్తే వెబ్‌సైట్‌ సమాచారం వస్తుంది.
  • ఏదైనా వెబ్‌సైట్‌ తెరిచి ప్యాడ్‌లాక్‌ క్లిక్‌ చేసినప్పుడు వెబ్‌సైట్‌ భద్రతా ప్రమాణాలను తెలియజేస్తూ హెచ్చరిస్తుంది. నకిలీదైతే వెబ్‌సైట్లలో ఏదైనా సమాచారం నమోదు చేస్తే డేటా చోరీకి గురవుతుందని సూచిస్తుంది. అసలైన వెబ్‌సైట్‌ అయితే భద్రమేనని తెలియజేస్తుంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌ చివర gov.in అని ఉంటుంది.

'నా వద్ద 8 కిలోల బంగారం ఉంది - కేవలం రూ.2 కోట్లకే ఇచ్చేస్తా'

'మా వద్ద చికిత్స తీసుకుంటే జబ్బులు మటుమాయం' : డబ్బులు కాజేస్తున్న నకిలీ డాక్టర్లు

Last Updated : Jan 21, 2025, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details