తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు - ప్రతిపక్షాలపై పంజాపాలన : మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి - PRASHANTH REDDY SLAMS CONGRESS

BRS PRASHANTH REDDY SLAMS CONGRESS : బడ్జెట్ సమావేశాలను బుల్​డోజ్ సమావేశాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని, మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరు రోజులు రోజుల్లో ఒక్క రోజే ప్రశ్నోత్తరాలకే అవకాశం ఇచ్చారని, జీరో అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారన్న ఆయన, బీఆర్ఎస్​ను తిట్టేందుకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etv Bharat
Prashanth reddy Slams CM Revanth (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 3:15 PM IST

Updated : Aug 3, 2024, 3:21 PM IST

Prashanth reddy Slams CM Revanth : రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలన అని మాజీమంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని, నిరసన తెలిపితే మార్షల్స్​తో సభ నుంచి బయటకు పంపించారని ఆయన మండిపడ్డారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి తన వికృత రూపం బయటపడిందని, ప్రజలకు ఈ దౌర్భాగ్యం కలిగినందుకు తాను బాధ పడుతున్నట్లు తెలిపారు.

"2 పేపర్లపై ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి - జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు" - BRS Protest Against On Job Calendar

కౌరవుల సభలా సాగింది : శాసనసభ జరుగుతున్న తీరును చూసి కాంగ్రెస్​తో స్నేహంగా ఉంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కూడా తప్పుపట్టారని ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సభా నాయకుడిలా కాకుండా ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్​ సభ్యులు మంచిగా మాట్లాడుతున్న సందర్భంలో, రేవంత్ రెడ్డి తప్పుడు పత్రాలు తీసుకొచ్చి సభను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై ఏడుపు, కేసీఆర్​ను తిట్టడం, కౌరవులలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పడం తప్ప ఇంకోటి లేదని పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు : కల్లుండి చూడలేని కబోదిలా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతున్నారని ప్రశాంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణకు ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్​లో గ్యారంటీల ఊసే లేకుండా పోయిందని, హామీల అమలు, బడ్జెట్​లో నిధులు లేకుండా పోయాయని అడిగితే సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారని, సభను తప్పుదోవ పట్టించారన్నారు.

ఎక్కడైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా, దీనిపై మేధావులు స్పందించాలని, ప్రశాంత్​రెడ్డి సూచించారు. విద్యుత్ మీటర్ల విషయంలో సీఎం సభను తప్పుదోవ పట్టించారని, ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడరని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్​రెడ్డికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు ఇవ్వాలని, ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధాలను ఆడటంలో రేవంత్ రెడ్డి పేరును గిన్నిస్ రికార్డులో చేర్చడానికి సిఫారసు చేస్తామన్నారు.

సీతారామ ప్రాజెక్టు కింద రూ. 75 కోట్లతో, 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అంటున్నారని, ఆయనకు కేంద్ర నీటిపారుదలశాఖ మంత్రి ఇవ్వాలని ప్రధాని మోదీకి సూచిస్తున్నాట్లు ప్రశాంత్​రెడ్డి తెలిపారు. అబద్ధాల్లో భట్టి విక్రమార్కకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, చిల్లర వేషాలు వేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వాడుకున్నారని మండిపడ్డారు.

"రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలన. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నేతలు ఎన్నో అబద్ధాలు చెప్పారు. అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. దీనిపై మేధావులు ఆలోచించాలి". - ప్రశాంత్​రెడ్డి, మాజీమంత్రి

సోనియా గాంధీ కోరిక మేరకే ఆనాడు కాంగ్రెస్​ ప్రభుత్వంలో చేరా- పదవుల కోసం కాదు : హరీశ్ రావు - BRS MLA Harish Rao Fires On Revanth

మేం చేసిన అప్పుల గురించి చెప్పారు - మరి ఆస్తుల గురించి మాట్లాడాలి కదా? : కేటీఆర్ - KTR SLAMS CONGRESS GOVT IN ASSEMBLY

Last Updated : Aug 3, 2024, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details