Ex Minister Ktr Comments On Cm Revanthreddy: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాటా మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ సీఎం ఎందుకు భయపడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు ఫణంగా పెడుతున్నారని నిలదీశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి, రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. దీని గురించి ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఆయన ఓ ఫొటో షేర్ చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీల అమలట : కేటీఆర్
Ex Minister Ktr Comments On Congress Party :మరో ట్వీట్లోబీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ, రాజకీయ శక్తులకే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : మర్రి జనార్దన్ రెడ్డి
Ktr Comments On Congress Party :కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి వల్లే ఇండియా కూటమి చెల్లా చెదురవుతుందని, ఆ పార్టీ ఆత్మ పరీశీలన చేసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. దేశంలో బీజేపీని మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరని వ్యాఖ్యానించారు. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో, ఇతర పార్టీలతో పోటీ పడుతుందని, దీంతో బీజేపీకే లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని తెలిపారు.
మమతా బెనర్జీ ఏమన్నారంటే? : 'కాంగ్రెస్ 300కు 40 సీట్లు గెలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అంత అహంకారం ఎందుకు మీకు. రాహుల్ గాందీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బంగాల్‌కు వచ్చారు. ఆ విషయం నాకు తెలియదు. ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మనం ఇండియా కూటమిలో ఉన్నాం. అయినా నాకు సమాచారం ఇవ్వలేదు. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోతారు.' అని మమత మండిపడ్డారు.
బీఆర్ఎస్లో మానసిక క్షోభకు గురయ్యా - పార్టీ విధానాలు ఏమాత్రం నచ్చట్లేదు : తాటికొండ రాజయ్య
ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి - సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ