ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ @ విజయ్​పాల్

రఘురామ చిత్రహింసల కేసులో అరెస్టయిన విజయ్‌పాల్‌పై అనేక ఆరోపణలు

EX CID ASP Vijay Paul Arrest
EX CID ASP Vijay Paul Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

EX CID ASP Vijay Paul Arrest :రఘురామ కృష్ణంరాజుని చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు గాంచారు. వైఎస్సార్సీపీ పెద్దల అండదండలతో కన్నూమిన్నూ కానరాకుండా ఐదేళ్ల పాటు రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. మీడియా ప్రతినిధులపైన సైతం పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. చివరకు ఆయణ్ని విచారించడానికి ఇన్‌స్పెక్టర్‌, అదనపు ఎస్పీ కూడా సాహసించలేనంతగా పేట్రేగిపోయారు.

సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీవిరమణ చేసిన విజయ్​పాల్ అత్యంత పనిమంతుడు అనే ఉద్దేశంతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్​ సీఐడీలోనే ఓఎస్డీ పోస్టును కట్టబెట్టింది. దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కన్నూమిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారిపై, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే అప్పగించేవారు. దీంతో వారి మెప్పు కోసం విజయ్​పాల్ ఇంకా పేట్రేగిపోయారు. చివరికి అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బరు బెల్ట్‌లతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులు ఉన్నాయి.

రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసు - విజయ్‌పాల్ అరెస్టు

సునీల్‌కుమార్‌కు కళ్లు, చెవుల్లా ఉంటూ అరాచకాలు : నాటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు కళ్లు, చెవులు సహా అన్ని తానై ఉంటూ అక్కడ ఓ సూపర్‌పవర్‌లా విజయ్‌పాల్‌ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఉద్యోగంలో ఓఎస్డీగా వైదొలిగిన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌పాల్‌ను కనీసం విచారణకు పిలిపించేందుకూ సాహసించలేదు. తర్వాత ఐఓగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ ఆయనకు నోటీసులిచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు.

"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR

దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ దామోదర్‌ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన ఇద్దరు లాయర్లను నియమించుకొని మరీ తన తరఫున వాదనలు వినిపించారు. పదవీవిరమణ చేసిన ఓ పోలీసు అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? వీటిని బట్టే ఆయన వెనక నుంచి నడిపించిన, నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్

దురుసుతనానికి మారుపేరు : విజయ్‌పాల్‌ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో, ఎంతలా విర్రవీగేవారో అప్పట్లో సీఐడీలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు. ఆయణ్ని ఎవరైనా కలవాలంటే మూడు, నాలుగు అంచెల్లో అనుమతి పొందాల్సిందే. ఎవడ్రా నువ్వు, ఎవడ్ని అడిగి లోపలికి వచ్చావు? మీడియా అయితే నీకెందుకురా చెప్పాలి? అంటూ తీవ్ర పరుష పదజాలంతో మీడియా ప్రతినిధులపై ఆయన విరుచుకుపడిన సందర్భాలూ ఉన్నాయి. అక్రమ కేసుల్లో అరెస్టు చేసి వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టేటప్పుడు మీడియా ప్రతినిధులు కవరేజికి వెళ్తే మీరెవర్రా ఇక్కడికి రావడానికి? ఇక్కడ మీకేం పని? అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు.

అదానీ సంస్థ లంచాల వ్యవహారం - జగన్​పై ఏసీబీకి ఫిర్యాదు

Raghurama Torture Case Updates :రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటివరకూ మూడుసార్లు విజయ్​పాల్​ విచారణకు హాజరయ్యారు. కానీ విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా అంటూ డొంకతిరుగుడు సమాధానాలే చెప్పారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం దాల్చారు. దీంతో చివరికి పోలీసులు ఆయణ్ని అరెస్టు చేశారు.

రఘురామకృష్ణరాజును ఎందుకు నిర్బంధించారు? - "తెలియదు, గుర్తులేదు"

చట్టవిరుద్ధంగా విధులకు లైసెన్స్‌ ఇవ్వలేదు - విజయపాల్‌ బెయిల్ పిటిషన్​​ కొట్టివేత - HC Rejected Vijay Pal Bail Petition

ABOUT THE AUTHOR

...view details