ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడంచెల భద్రతతో స్ట్రాంగ్‌రూంల్లోకి ఈవీఎంలు - Security at EVMs in strong rooms

EVM Moved to Strong Rooms in All Districts: రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం సోమవారం అర్థరాత్రి వరకు పోటెత్తడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడం ఆలస్యమైంది. స్ట్రాంగ్‌రూంల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసి బూత్‌ల వారీగా స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు భద్రపరిచి అధికారులు సీలు వేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా పహారా కాస్తున్నారు.

EVM Moved to Strong Rooms in All Districts
EVM Moved to Strong Rooms in All Districts (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 10:50 PM IST

EVM Moved to Strong Rooms in All Districts: ఓట్లకు జనం పోటెత్తడంతో సోమవారం అర్థరాత్రి వరకు పోలింగ్ సాగడంతో ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడం ఆలస్యమైంది. సోమవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను తరలించారు. నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు భద్రపరిచి అధికారులు సీలు వేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ కొనసాగుతోంది.

రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ - బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం - EVM Moved to Strong Room

Security at Strong Rooms Containing EVMs:సోమవారం అర్థరాత్రి వరకు పోలింగ్‌సాగడంతో ఈవీఎంల తరలింపు ఆలస్యమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించి భద్రపరిచారు. ఎన్టీఆర్​ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 234 బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. నందిగామకు చెందిన 222 ఈవీఎంలను సైతం ఇదే కళాశాలలో భద్రపరిచారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఈవీఎంలను ఒక చోటకు చేర్చి అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య స్ఠ్రాంగ్​రూలకు తరలించారు. నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. గుడివాడ, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రుకు చెందిన ఈవీఎంలను కృష్ణా యూనివర్సిటీలోని ప్రధాన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు.

కోనసీమ జిల్లాలో నిలిచిపోయిన పోలింగ్ - ఈవీఎంలు మొరాయించడంతో ఇంటిముఖం పట్టిన ఓటర్లు - AP Election Polling

గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. అధికారుల సమక్షంలో స్ట్రాంగ్‌రూం సీజ్ చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1900 పోలింగ్ బూత్‌ల నుంచి ఈవీఎంలను పటిష్టమైన భద్రత మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంకు తరలించారు. సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు ఈవీఎంలను తరలించి భద్రపరిచారు. మడకశిర, పెనుగొండ, కదిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను అధికారులు భద్రపరిచారు.

కర్నూలు జిల్లాలోని ఈవీఎం యంత్రాలను రాయలసీమ యూనివర్సిటీకి తరలించారు. 8 అసెంబ్లీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల ఈవీఎంలు వర్సిటీలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెల్లవారుజామున జేఎన్టీయూలోని స్ట్రాంగ్‌రూంకు ఈవీఎంలను తరలించారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈవీఎంలను రాయచోటి సాయి ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల తనిఖీలు - స్ట్రాంగ్ రూంలు, సీసీ కెమెరాలపై ఆరా తీసిన కలెక్టర్లు - Collectors inspection of EVMs

ABOUT THE AUTHOR

...view details