APEPDCLMobile APP to Paying Electricity Bills:విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) సరికొత్త ఫీచర్లతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లింపులను ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే పాత విధానంలో బిల్లుల చెల్లింపు కంటే ప్రస్తుతం తీసుకుని వచ్చిన మొబైల్ యాప్ ద్వారానే సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని తెలిపింది.
దీంతోపాటు ఈ యాప్ వినియోగం ద్వారా చాలా లాభాలు ఉన్నాయన్న ఏపీఈపీడీసీఎల్ ఇకపై ఈ యాప్ ద్వారానే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ మొబైల్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలి? సరికొత్త యాప్ వల్ల లాభాలేంటి? వంటి వివరాలు మీకోసం.
యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?: గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం 16 అంకెల విద్యుత్ మీటర్ సర్వీసు నంబర్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తద్వారా మొబైల్ యాప్ సేవలు పొందవచ్చు.
ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్ ఉపయోగాలు:
- ఈ సరికొత్త యాప్‌లో బిల్ పే ద్వారా అత్యంత సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.
- నిర్ణీత గడువులోగా బిల్లులు చెల్లించపోతే పెనాల్టీ ఉండదు.
- సర్వీసుకు సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు, చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వంటి వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
- విద్యుత్ మీటర్ సర్వీసుకు ఆధార్ నంబర్‌ను ఈ యాప్ ద్వారా లింక్ చేసుకోవచ్చు.
- ఇకపై విద్యుత్తు సంబంధిత సమస్యలను ఈ సరికొత్త యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది.
- ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే వాళ్ల ఈ కింద లింక్‌ను క్లిక్ చేసి కూడా APEPDCL యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఈ లింక్‌ను క్లిక్ చేయండి : APEPDCL
- https://play.google.com/store/apps/details?id=com.apepdcl.easternpower