Entire Village Migrated: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం గుడి కొత్తూరు గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. ఒక రోజంతా ఇంట్లో పొయ్యి వెలగదు, దీపం ముట్టించరు. చీకటి పడిన తరువాత ఇంటికి వస్తారు. ప్రతి ఏడాది ఒక రోజున గ్రామం మొత్తం ఖాళీ చేసి ఈ ఆచారాన్ని పాటిస్తారు. గ్రామం శివారులోని గుట్టల మధ్యలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి రాత్రి అయిన తరువాత తిరిగి గ్రామానికి చేరుకుంటారు.
చీకటి పడిన వెంటనే మొదటగా పశువులు తర్వాత గ్రామదేవతలను తీసుకొని వెళ్తారు. అనేక సంవత్సరాలుగా గ్రామస్థులు పాటిస్తున్న ఆచారం ఇది. గుడికొత్తూరులో గ్రామస్థులు చేసే ఈ సంప్రదాయం గురించి జిల్లాలో తెలియని వారుండరు. ఒక రోజు మొత్తం గ్రామంలోని ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి పశువులు, మేకలతో సహా గ్రామ వెలుపల ఉండే గుట్టల్లోకి తరలి వెళ్తారు. అక్కడే వంటావార్పు చేసుకుంటారు. అనంతరం రాత్రి అయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారు.
సమాధులు తవ్వి, మృతదేహాలపైకి నీళ్లు పంపింగ్.. కారణం ఇదేనట!
ఇది తమ పూర్వీకుల పెట్టిన సంప్రదాయం అని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామస్థుల మధ్య ఐక్యత పెరగడానికి, గ్రామంలో ఏదైనా చెడు ఉంటే అది వైదొలగేందుకు ఇప్పటికీ ఈ విధంగా చేస్తున్నామని అంటున్నారు. అదే విధంగా గ్రామానికి మంచి జరగాలని, వర్షాలు బాగా కురవాలని ఈ ఆచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఈ గుడికొత్తూరు గ్రామస్థులు తమ ఆచారాన్ని పాటించారు. ఆదివారం ఉదయమే గ్రామస్థులంతా వంట చేసుకోటానికి అవసరమైన సరుకులను వాహనాలపై పెట్టుకుని గ్రామం దాటి వెళ్లిపోయారు. ఇళ్లకు తాళాలు వేసి వృద్ధులతో పాటు చిన్నారులు సహా గ్రామమంతా ఒకే సారి బయటకు వచ్చేశారు. వారితో పాటు ఇంట్లో పశువులు, మేకలు వెంటబెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామం నుంచి తరలిపోయారు. గ్రామంలోనికి ఇతరులు ఎవరూ రాకుండా కంచె వేశారు.
గుట్టల మధ్యలోని ఖాళీ స్థలంలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. గుట్టల వద్ద చెట్ల కింద వంటలు చేసుకుని, అక్కడే భోజనం చేసి రాత్రి అయిన తరువాత ఇంటికి చేరుకున్నారు. తొలుత చీకటి పడిన వెంటనే మొదటగా పశువులు వెళ్లిన తర్వాత గ్రామదేవతలను తీసుకొని గ్రామంలోనికి గ్రామస్థులంతా ఒకే సారి వెళ్లారు.
వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?