TDP Leaders Complaint Election Commission Visakha Drugs Case :వైసీపీ అండదండలతోనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా సాగుతోందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండటం సిగ్గుచేటన్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వైసీపీ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ పోర్టులో పట్టుబడిన కంటైనర్‌లో సీబీఐ సోదాలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని ఇంటర్‌పోల్ వరకు తీసుకెళ్లి పరువు తీశారన్నారు. ఈ ఘటనపై సమగ్ర చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు.
"ఇవాళ బ్రెజిల్ నుంచి 25 టన్నుల కంటైనర్ పట్టుపడింది. కొన్ని వేల కోట్లు విలువ కోట్లు విలువ చేసే కంటైనర్ తెరవకుండా వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు. గంజాయి దిగుమతి చేసుకోవడంలో ఎవరు ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది. వైసీపీ పార్టీకి అంటిన మరకలు టీడీపీకి అంటించలంటే అది కుదురే ప్రసక్తి లేదు. డ్రగ్స్ విషయంలో మన రాష్ట్ర ఘనతను ఇంటర్‌పోల్ వరకు తీసుకువెళ్లారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కనపడుతున్నాయి"_టీడీపీ నేత బోండా ఉమా
విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్ తెరవకుండా యత్నించారా? - YCP LEADERS IN VIZAG DRUGS CASE
YCP Leaders Complaint Election Commission Visakha Drugs Case :తెలుగుదేశం పార్టీపై మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ ఘటనపై సీబీఐ ఇంకా దర్యాప్తు చేయకముందే వైసీపీపై చంద్రబాబు నింద మోపుతూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారని అది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థులపై నిందలు, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
" విదేశాల్లో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసిన కంటైనర్‌పై సమగ్ర విచారణ జరిపించామని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాము. బ్రెజిల్ నుంచి గంజాయి దిగుమతి చేసిందని టీడీపీ అని మాకు అనుమానాలు, భయాలు ఉన్నాయి "_వైసీపీ నేతలు
డ్రగ్స్ కంటైనర్ మా పరిధిలోకి రాదు - మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ - VISAKHA CP ON DRUGS CASE