Election Campaign is Full Swing in Andhra Pradesh:రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో మమేకమవుతున్నారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 6వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించి ముస్లింలతో మమేకమ్యయారు. రాష్ట్రంలో బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు.
జగన్కు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే: పవన్ కల్యాణ్ - Pawan kalyan Election Campaign
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జయహో బీసీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొనకళ్ల నారాయణ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఉండవల్లి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో లంబాడీల ఆత్మీయ సదస్సులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
రెండు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం- ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం: చంద్రాబాబు
బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎం కొండయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో అద్దంకి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జోరుగా ప్రచారం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థులతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గాన్ని చేనేతకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
కోవూరు మండలం లేగుంటపాడులో చేనేత కుటుంబాలతో వారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు యాదవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్విహంచారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ జోరుగా ప్రచార జోరు పెంచారు.