Election Campaign in Andhra Pradesh :ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మూడు పార్టీల కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
'టీడీపీతోనే గ్రామస్వరాజ్యం సాధ్యం'- ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన పయ్యావుల - Payyavula Keshav Election Campaign
TDP, Janasena, BJP Alliance Campaign :క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. పంచాంగ పఠనాన్ని విన్నారు. స్థానిక తెలుగుదేశం నాయకుడు వర్మతోపాటు జనసేన నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని పవన్ ఆకాంక్షించారు.
State Wide All Parties Campaign : అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు సంకల్ప ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పసుపు దళం, భాజపా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ టీ టైమ్ విత్ అద్దంకి నిర్వహించారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.
'అమరావతిని బతికించుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవాలి' ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు - Alliance Leaders Election Campaign
Prakasam District Election Campaign :ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు మర్రిచెట్టు వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. నెల్లూరు అర్బన్ కూటమి అభ్యర్థి నారాయణ నగరంలోని 42వ డివిజన్‌లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు పార్టీ కరపత్రాలను అందజేసి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. నారాయణ, మాజీ మంత్రి
'ఐదేళ్ల నష్టాన్ని వివరిస్తూ- భవిష్యత్ భరోసా కల్పిస్తూ' - ఇంటింటికీ కూటమి అభ్యర్థుల ప్రచారం Election Campaign Kurnool :ఒంగోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తామంటూ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారానికి మరిన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురానికి చెందిన వంద మంది సీపీఐ కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
'పేదల బాధలు పట్టని కాంగ్రెస్- మా వల్ల పదేళ్లలో 25కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి' - PM Modi slams congress