ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - ED Raids in MLC Kavithas House
ED Raids at MLC Kavitha's House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. తనిఖీల నేపథ్యంలో ఆమె నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 2:59 PM IST
|Updated : Mar 15, 2024, 4:07 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారించింది. నేడూ విచారణకు రాగా, ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇంతలోనే ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేయడం గమనార్హం.
'కేసు కోర్టులో ఉన్నా పదేపదే సమన్లా?'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడోసారి దూరం