Ramoji Film City Winter Festival in Hyderabad : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మధురానుభూతులు పంచే వినోద కార్యక్రమాలు ఆధునిక నృత్యాలు, సందర్శకుల కేరింతలతో సందడిగా మారింది. అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్యాలతో పర్యాటకులు పులకించిపోయారు. క్రిస్మస్, నూతన సంవత్సరాలను ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ వేడుకలు తొలి రోజే అంబరాన్నంటాయి.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మైమరిపించే సంగీతాలు, కళాకారుల ప్రదర్శనలు, తమాషా వేషాధారణలు, రంగురంగుల విద్యుద్దీపాలు, ఆటపాటలు ఇలా మరెన్నో విశేషాలతో సందర్శకుల్లో నూతనఉత్సాహాన్ని నింపుతోంది. అట్టహాసంగా ప్రారంభమైన సంబరాలు జనవరి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు ప్రత్యేక వినోదాలు, సాయంత్రం వేళ కార్నివాల్ పరేడ్‌లు సందర్శకులను ఎంతగానో అలరించాయి. అడుగడుగునా ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకులను కట్టిపడేశాయి. ఉర్రూతలూగించే పాటలకు చిన్నాపెద్ద అందరూ జోష్‌గా డ్యాన్స్‌లు చేశారు.
వింటర్ ఫెస్ట్‌కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలను వీక్షిస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. ఫిలీం సిటీలో జీవితంలో మునుపెన్నడు చూడని అద్భుతాలు చూశామంటున్నారు. కుంటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి గడిపేందుకు ఇది చక్కటి అవకాశం అని అంటున్నారు. కార్నివాల్ పరేడ్ తమ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలుగా మిగిలిపోతాయని పర్యాటకులు ఉత్సాహంగా చెబుతున్నారు.
" రామోజీ ఫిల్మ్‌సిటీ చాలా కలర్పుల్గా ఉంది. మా పిల్లలు ఇక్కడ చాలా ఆనందంగా ఆడుకున్నారు. మేము చాలా ఎంజాయ్ చేశాము. ప్రతిఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. సినిమా సెట్లు, రైడ్స్, సాహస్ యాత్ర, ఫుడ్ క్వాలిటీ ప్రతి ఒక్కటి సూపర్‌గా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలున్నాయి." - పర్యాటకులు
ఫిల్మ్‌సిటీ పర్యటన ఎన్నో మధురానుభూతిని మిగిల్చిందని మళ్లీ మళ్లీ వచ్చినా తనివితీరదని పర్యాటకులు చెబుతున్నారు. బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన మాహిష్మతి సామ్రాజ్య సెట్లు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు ఒక్కసారి అయిన ఫిల్మ్‌సిటీ సందర్శించాల్సిందేనని కితాబులిస్తున్నారు.
ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకగా రామోజీ ఫిల్మ్‌సిటీలో డిసెంబర్ 31న రాత్రి వేడుకల్లో డీజే చేతాస్ లైవ్ ప్రదర్శనతో పర్యాటకులను ఓలలాడించనున్నారు. డీజే వేదికపై సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆకాశాన్నంటే సందడి మధ్య న్యూ ఇయర్ పార్టీని ఆస్వాదించేందుకు అవకాశం ఉంది. లైవ్ బ్యాండ్ జోరు ఉత్తేజకరమైన వినోదం కలగలిసి సంబరాలు మిన్నంటనున్నాయి. బాలీవుడ్ నృత్య ప్రదర్శనలు, అంతర్జాతీయ స్థాయి ఫైర్ యాక్షన్లు, స్టాండప్ కామెడీ ఇలా క్షణక్షణం మధురమైన అనుభూతిని పంచే సంబరాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 19 వరకు నెల రోజుల పాటు జరిగే సంబరాలు కొనసాగనున్నాయి.
రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్‌ను మరింతగా ఆనందించేలా నిర్వాహకులు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.