ETV Bharat / state

ఇలా చేస్తే ప్రతి క్షణం ఆనందమయమే - కొత్త సంవత్సరంలో మీరేం చేయాలనుకుంటున్నారు - 2025 NEW YEAR PLANNING

అదును చూసి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - ప్రారంభించాలనుకున్న పనికి వెంటనే పునాదులు వేయాలి

new_year_planning
new_year_planning (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

New Year 2025 Planning : కాల చక్రంలో మరో కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం వెళ్లిపోతోంది. ఒక ఏడాది అంటే 365 రోజులు అని కాకుండా 365 అవకాశాలుగా భావించి అదును చూసి సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నపుడే ప్రారంభించి, సాధించాలనుకున్న పనికి వెంటనే పునాదులు వేయాలి. ప్రతి క్షణం జీవితంలో ఆనందంతో గడపాలంటే ప్రణాళికతోపాటు ముందుకు నడిపే దిక్సూచి అవసరం.

పెద్ద​ కంపెనీ కారైనా, ఇంజిన్‌ శక్తిమంతమైనా, రోడ్డు అద్భుతంగా ఉన్నా, దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటే ప్రయాణం మెల్లగా సాగాల్సిందే. అదే విధంగా ప్రణాళికలు లేని జీవితాలు కూడా అంతే. ప్రణాళికలతో జీవితం కొనసాగిస్తే జీవితం అందరికీ సుఖసంతోషాలకు వేదికే.

దేశానికే కాదు మన ఇంటికీ బడ్జెట్‌ రూపొందించుకోవాలి. ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్క రాసుకోవడంతో పాటు ఈ సంవత్సరం సాధించాల్సిన లక్ష్యాలు, వాటి ఖర్చులు అంచనా వేసుకోవాలి. ఎంత ఆదా చెయ్యాలో ప్రణాళికను రూపొందించుకుని ఆదాయాన్ని మించిన ఖర్చు అనే ఆలోచన రాకుండా చూసుకోవాలి.

ఎప్పుడు ఏ ఆపద వస్తుందో? ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఎవరికి తెలుసు? ఉన్నట్టుండి అడిగితే డబ్బులు ఇచ్చేవారూ అరుదే. ఆ పరిస్థితుల్లో ఆదుకోడానికి కొంత నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ మేరకు ప్రతినెలా ఎంతో కొంత ఆదా చేయాలి.

ఉద్యోగ విరామ అనంతర ప్రణాళిక 50 ఏళ్లు దాటాక ఆలోచించేది కాదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైరయ్యే నాటికి ఎంత నగదు ఉండాలో ఆలోచించుకోవాలి. చిన్న వయసులోనే మదుపు మొదలెడితే తక్కువ కాలంలో ఎక్కువ జమవుతుంది.

జీవిత బీమా ప్రతి ఒక్కరికీ ధీమానిస్తుంది. బైక్, కారు, ఇల్లు, ఆరోగ్య, జీవిత బీమాలను తక్షణం సరిచూసుకోండి. వయసు మళ్లిన కొద్దీ బీమా నిబంధనలు మారుతుంటాయి. వయసుకు తగ్గట్టు ఇన్స్యూరెన్స్ ​ ఏజెంట్‌ను సంప్రదించి, అవసరాలకు అనుగుణంగా పాలసీ తీసుకోండి.

ఎనిమిది సూత్రాలను అమలు చేస్తే జీవితంలో ఆనందమంతా మీదే అని ప్రఖ్యాత రచయిత కుష్వంత్‌ సింగ్‌ అభిప్రాయం.

1.అసలైన సంపద అదే

ఆరోగ్యాన్ని నిజమైన సంపదగా భావించండి. మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకుంటే మాత్రం జీవితాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేరు.

2. బ్యాంక్‌ బ్యాలెన్స్‌

లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీ అవసరాలను తీర్చేంత కొంత ఉంటే చాలు. మనం అనుకున్న మంచి హోటల్లో తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రాంతాన్ని ఆస్వాదించడం, నచ్చిన సినిమాను చూడడం. ఇలాంటి సాకారమయ్యే కోరికలను సాకారం చేసుకోగలగాలి. చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని ఒప్పుకోవడమే అవుతుంది.

3. ఆ కల కోసం

అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే ఫీలింగ్​ను కలిగించదు. మీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇష్టంగా కష్టపడండి. మీరే స్వయంగా మొక్కలను నాటండి. వాటి ఎదుగుదలను నిరంతరం చూడండి. వాటితో బంధుత్వ భావాన్ని మంచి మనసుతో పెంపొందించుకోండి.

4. అర్థం చేసుకునే భాగస్వామి

మీ జీవితంలో మరో మైలు రాయి మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి. మీ ప్రయాణంలో అపార్థాలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని అస్సలు తెచ్చుకోవద్దు.

5. పోలిక వద్దు

జీవితంలో మీకంటే ఉన్నతస్థాయిలో ఉన్నవారిని చూసి పోల్చి చూసుకోకండి. మీకన్నా చాలా బాగా ఎదిగారు బాగా సంపాదించారు. మంచి పేరు సంపాదించారంటూ ప్రతికూల ధోరణితో కూడిన ఆలోచనలు అస్సలు చేయకండి.

6. వారిని దగ్గరకు రానివ్వద్దు

గాలి కబుర్లు, చెప్పుడుమాటల కోసం వచ్చే వారిని మీ దగ్గరకు రాకుండా నిలుపుదల చేయండి. ఒకవేళ రానిస్తే వారిని మీరు వదిలించుకోవాలంటే చాలా అలసిపోతారు. మైండ్​ డిస్టర్బ్​ అవుతుంది.

7. సంతృప్తినిచ్చే అలవాట్లు

తోటపని, ఆడటం, చదవడం, రాయడం, పాటలు వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి. ఇవి మీలో క్రియేటివిటిని పెంచుతాయి.

8. రోజూ 15 నిమిషాలు

ప్రతి రోజ ఉదయం, సాయంత్రం 15 నిమిషాల చొప్పున సమయాన్ని మీ గురించి మీరు ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి. ఉదయం 10 నిమిషాల పాటు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మరో 5 నిమిషాలు ఆరోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను తయారు చేసుకోవడానికి కేటాయించండి.

రామోజీ ఫిల్మ్‌సిటీలో న్యూఇయర్​ సెలబ్రేషన్స్​- అట్టహాసంగా వింటర్​ఫెస్ట్​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.