ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో పాతుకుపోయిన అనిల్‌ కుమార్‌రెడ్డి - టీడీపీ ఫిర్యాదుపై ఈసీ విచారణ - EC Ordered Enquiry in Anil Kumar - EC ORDERED ENQUIRY IN ANIL KUMAR

EC Ordered Enquiry in Anil Kumar Reddy: పులివెందుల వైసీపీ నాయకులతో పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి అంటకాగుతున్నారని టీడీపీ నేత బీటేక్​ రవి ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలకు ఉపక్రమించింది. సీఎం జగన్​ పులివెందుల నుంచి పోటీ చేయడంతో ఓటర్లను ప్రభావితం చేస్తారని ఆయన ఫిర్యాదు చేయడంతో తక్షణమే విచారణ జరిపి 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ జిల్లా అధికారులను ఈసీ ఆదేశించింది.

EC Ordered Enquiry in Anil Kumar Reddy
EC Ordered Enquiry in Anil Kumar Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 12:34 PM IST

పులివెందులలో పాతుకుపోయిన అనిల్‌ కుమార్‌రెడ్డి - టీడీపీ ఫిర్యాదుపై ఈసీ విచారణ

EC Ordered Enquiry in Anil Kumar Reddy:సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీతో అంటకాగుతున్న పాడా ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఈ నెల 23న టీడీపీ పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి బీటెక్‌ రవి ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలకు ఉపక్రమించింది. తక్షణమే విచారణ జరిపి 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ జిల్లా అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ఓఎస్డీగా అనిల్‌ కుమార్‌రెడ్డి ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పులివెందుల వైసీపీ నాయకులతో అంటకాగుతున్నారని బీటెక్‌ రవి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు - Atchannaidu complaint to EC

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే రెండు రోజుల ముందు అంటే ఈ నెల 14వ తేదీ వరకు పులివెందులలోని వైసీపీ కార్యాలయం, పాడా ఓఎస్డీ, సీఎం క్యాంపు కార్యాలయం ఒకే భవనంలో ఉండేవి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కొత్తగా నిర్మించిన మినీ సచివాలయం భవనంలోకి పాడా కార్యాలయాన్ని మార్చారు. ఇదే భవనంలో పాడా కార్యాలయంతో పాటు ఆర్వో కార్యాలయం కూడా ఉంది. ఎవరైనా కోడ్‌ ఉల్లంఘనలపై ఆర్వో కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటే అదే భవనంలో పాడా కార్యాలయం ఉన్నందున ఇబ్బందులు పడే అవకాశం ఉందని బీటెక్ రవి పేర్కొన్నారు.

ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలన్న ఈసీ నిబంధనపై ప్రధాన పార్టీల అభ్యంతరం!

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఓఎస్డీ అనిల్‌కుమార్‌ రెడ్డికి ఐఏఎస్‌ హోదా కూడా కల్పించిందని ఆయన గుర్తు చేశారు. జగన్‌ పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున పాడా ఓఎస్డీ ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉందని రవి పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అనిల్ కుమార్ రెడ్డిని పులివెందుల నుంచి బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని బీటెక్‌ రవి ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించిన క్షణాల్లోనే అనిల్ కుమార్ వద్ద ఉన్న వైర్‌లెస్‌ సెట్‌ను ఆర్డీవో కార్యాలయంలో అప్పగించారు. దీంతోపాటు కడప స్పెషల్ బ్రాంచ్ సీఐ అశోక్ రెడ్డిపై కూడా బీటెక్ రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కడపలోనే సీఐగా పనిచేస్తున్న అశోక్ రెడ్డి వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో వివరించారు.

తాయిలాలతో బయలుదేరిన వైఎస్సార్సీపీ వాహనం- పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్! - EC Flying Squad seized ycp lorry

ABOUT THE AUTHOR

...view details