E-Office Web Application Version Update : రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ వెర్షన్ సామర్ధ్యం పెంచేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ షెడ్యూలు విడుదల చేసిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. పాత వెర్షన్ నుంచి ఈ-ఆఫీస్ తాజా వెర్షన్ 7.xకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు, సామర్ధ్యం పెంపునకు ఈ-ఆఫీస్ అప్లికేషన్ను మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
విండోస్ 11 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు తెచ్చేసింది!
ఏపీలో మే 17 తేదీ నుంచి 25 తేదీ వరకూ ఈ-ఆఫీస్ అప్లికేషన్ను అప్ గ్రేడ్ చేసేలా షెడ్యూలు చేశారని స్పష్టం చేశారు. ఆయా తేదీల్లో ఏపీ సహా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ సీబీఎస్ఈ కూడా ఈ-ఆఫీస్ వెర్షన్ను అప్ గ్రేడ్ చేసుకోవాలని తెలిపారు. పాతవెర్షన్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించేలా 7.xకు ఈ-ఆఫీస్ వెర్షన్ రూపోందించారని వెల్లడించారు. తాజా ఈ-ఆఫీస్ వెర్షన్ను అప్ గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందన్నారు.