ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసర ఉత్సవాలు - ఇక హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజలు - CELEBRATIONS ENDED AT INDRAKEELADRI

యాగశాలలో చండీహోమం అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం - గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామికి దుర్గా ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు

Dasara Sharan Navaratri Celebrations Ended at Indrakeeladri
Dasara Sharan Navaratri Celebrations Ended at Indrakeeladri (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 4:16 PM IST

Dasara Sharan Navaratri Celebrations Ended at Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో చండీహోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు.

జలవిహారానికి అనుమతి నిరాకరణ : తెల్లవారుజామున 3 గంటల నుంచే రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కొండపైనుంచి ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామికి దుర్గా ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతిఏడాది కృష్ణానదిలో నిర్వహించే జలవిహారానికి ఈ ఏడాది అనుమతి నిరాకరించారు. నీటి ఉద్ధృతి కారణంగా దుర్గా ఘాట్‌ వద్దే ఉత్సవమూర్తులకు హంస వాహనంపై పూజలు నిర్వహిస్తారు.

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ - జలవిహారంపై ఇవాళ మధ్యాహ్నంలోగా నిర్ణయం

పెద్ద సంఖ్యలో భవాని మాల భక్తులు : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. విజయదశమి చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో సాధారణ భక్తులతో పాటు అధిక సంఖ్యలో భవాని మాల ధరించిన భక్తులు దర్శనార్థం వచ్చారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో పాటు ఉక్కపోత అధికంగా ఉండడంతో పలువురు భక్తులు కళ్లు తిరిగి పడిపోతున్నారు.

భక్తులతో నిండిపోయిన క్యూ లైన్లు :దసరా నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. దుర్గమ్మ మాల ధారణతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వాసం.

సరస్వతీదేవి రూపంలో అమ్మవారు - రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు

శ్రీమహాచండీ అలంకారంలో కనకదుర్గమ్మ - వేద పండితులు ఏం చెప్తున్నారంటే! - Navaratri celebrations 5th day

ABOUT THE AUTHOR

...view details