AP HC Rejected Borugadda Anil Bail Petition : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నారా? అని న్యాయస్థానం వాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు.
అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Borugadda Anil Case Update : మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతనివైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్ కేంద్రమంత్రిగా పని చేసిన రాందాస్ అఠావలె అనుచరుడిగా చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. వైఎస్ జగన్‌ను అన్నా అని సంబోధిస్తూ తానూ పులివెందులకు చెందినవాడినేనంటూ వైఎస్సార్సీపీతో అంటకాగాడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులపై సభ్యసమాజం తలదించుకునేలా సోషల్ మీడియా, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. వైఎస్సార్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి బోరుగడ్డ అనిల్ అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు. అప్పట్లో వైఎస్ జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలతో హల్‌చల్ చేశాడు. నాడు అధికార పార్టీ వైఎస్సార్సీపీ అండదండలు ఉండటంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. జగన్ పేరు చెబుతుండటంతో పోలీసుల అతడి వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయాడు.
ఓ యూట్యూబ్ ఛానల్ బాధ్యతా రాహిత్యం వల్లే ఈ పరిస్థితి : బోరుగడ్డ