ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌- అనంతపురంలో సందడే సందడి - Duleep Trophy IN ANANTAPUR - DULEEP TROPHY IN ANANTAPUR

Indian Cricket Team At Anantapu : దేశవాళీలో అత్యంత ప్రతిష్ఠాత్మక దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీల సందడి ప్రారంభమైంది. పోటీల్లో పాల్గొనే భారత్‌ జట్లు అనంతపురం చేరుకున్నాయి. నగరంలోని మాసినేని గ్రాండ్‌ హోటల్‌కు భారత్‌-ఎ, బి జట్ల క్రీడాకారులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.

indian_cricket_team_at_anantapu.
indian_cricket_team_at_anantapu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 1:37 PM IST

Duleep Trophy 2024 Cricket Match in Anantapur :దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనే క్రికెటర్లు అనంతపురం చేరుకున్నారు. నగరంలోని మాసినేని గ్రాండ్‌ హోటల్‌కు భారత్‌-ఎ, బి జట్ల క్రీడాకారులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలువురు క్రికెటర్లు వివిధ మార్గాల ద్వారా అనంతపురం చేరారు. రెండో రౌండ్‌ పోటీలు ఈ నెల 12 నుంచి 15 వరకు అనంతపురం క్రికెట్‌ మైదానాల్లో నిర్వహిస్తారు.

  • భారత్‌-ఎ, బి, సి, డి జట్లు ఒక్కో మ్యాచ్‌ ఆడాయి. తొలి రౌండు మ్యాచ్‌లు భారత్‌ ఏ, బి జట్ల మధ్య, భారత్‌ సి, డి జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రెండో రౌండ్‌ పోటీలకు జట్లలో మార్పు చేర్పులు జరిగాయి. బంగ్లాదేశ్‌తో టెస్టు సీరీస్‌ త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా అక్షర్‌ పటేల్, శుభమన్‌గిల్‌ లాంటి మేటి ఆటగాళ్లు సీనియర్‌ జట్టుకు ఎంపిక కావడంతో ఈ పోటీల నుంచి వైదొలిగారు.

దులీప్‌ ట్రోఫీ సన్నాహాలు- అనంతపురం చేరుకున్న క్రికెటర్లు - Indian Cricket Team At Anantapur

  • కెప్టెన్ల మార్పు కూడా జరిగింది. భారత్‌-ఎ జట్టుకు సారథిగా ఉన్న శుభమన్‌ గిల్‌ బంగ్లా సీరీస్‌కు వెళ్లడంతో ఆయన స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను నియమించారు. రెండు జట్ల క్రీడాకారులకు హోటల్లో ఘనస్వాగతం పలికారు. క్రికెటర్లను చూడటానికి అభిమానులు హోటల్‌ వద్ద పడిగాపులు కాశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా అభిమానులను కలవడానికి అవకాశం ఇవ్వలేదు. భారత్‌-ఎ, బి జట్ల జట్ల వివరాలను ప్రకటించారు.

భారత్‌-ఎ జట్టు :మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), రియాన్‌ పరాగ్, ఎస్కే రషీద్, తిలక్‌వర్మ, శివందుబే, అక్షయ్‌ వడ్‌కర్, తనూష్‌ కోటియన్, షమ్స్‌ ములాని, ప్రసిద్‌కృష్ణ, ఖలీల్‌ అహ్మద్, అవేష్‌ఖాన్, కుమార్‌ కుషర్గ, శష్వత్‌ రావత్, అక్యూబ్‌ఖాన్, ప్రథమ్‌ సింగ్‌. కోచ్‌: సునీల్‌జోషీ

భారత్‌-బి జట్టు :అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), రింకూసింగ్, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్‌ కుమార్, ఆర్‌.సాయికిశోర్, ముషీర్‌ఖాన్, నితీష్‌కుమార్‌రెడ్డి, సూయాష్‌ ప్రభుదేశాయ్, రాహుల్‌ చాహర్, ఎన్‌.జగదీశన్, హిమాన్సు మాంత్రి, సౌరషిష్‌ లహరి, మోహిత్‌ అవస్తి, జర్నయిల్‌ సింగ్‌. కోచ్‌ సితాన్షు కోటక్‌.

దులీప్ ట్రోఫీకి మన స్టార్లు రెడీ- లైవ్ మ్యాచ్​ ఎక్కడ చూడాలో తెలుసా? - Duleep Trophy 2024

భారత్‌-డి జట్టులో మార్పులు :భారత్‌-డి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరి క్రీడాకారులను మార్పు చేశారు. అక్షర్‌పటేల్‌ స్థానంలో డి.నిశాంత్, తుషార్‌ దేశ్‌పాండే స్థానంలో కావేరప్పను జట్టులో తీసుకున్నారు. మిగతా క్రీడాకారుల్లో ఎలాంటి మార్పులు లేవు.

ABOUT THE AUTHOR

...view details