Drugs Seized in Hyderabad : పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్‌ను నగరంలోకి యథేచ్ఛగా తీసుకువచ్చేస్తున్నారు. మాదక ద్రవ్యాలకు(Drugs) బానిసై కొందరు యువకులు ఇంకా ఆ ఊబిలోనే ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తు ఇచ్చే కిక్ ముందు ఏం జరిగిన ఫర్వాలేదు లే అన్నట్లు మత్తు ప్రియులు డ్రగ్స్‌ను నగరంలోకి తీసుకువస్తున్నారు. తాజాగా గోవా నుంచి నగరంలోకి మాదక ద్రవ్యాలు తీసుకుని వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు ఈవెంట్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితులు గణేష్, భరత్, సాయి దిలీప్, గౌతం మత్తు పదార్థాలు సేవించాలని భావించారు. నాగరాజు ఈవెంట్ ఆర్గనైజర్ కావడంతో అతనికి మాదకద్రవ్యాలు గోవాలో ఎక్కడ దొరకుతాయి అనే సమాచారం ఉంది. దీంతో స్నేహితులను గోవా(Drugs Brought from Goa) తీసుకువెళ్లి అక్కడ 5 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశారు.
బాలికలకు డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు
వారు బస్సులో సనత్‌నగర్‌కు రాగానే విషయం తెలిసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. ఆ సోదాలో 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయి, ఓసీబీ రోలింగ్ పేపర్స్, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. స్నేహితుడి పుట్టినరోజుకు వీటిని తీసుకువచ్చామని ఒకరు చెప్పగా మిగిలిన వారంతా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఒడిశా యువకులు : మరోవైపు హైదరాబాద్ నగరంలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల చాలా చోట్ల గంజాయి పట్టుబడుతోంది. ఎన్నికల వేళ అక్రమ నగదు, మద్యం రవాణాపై దృష్టి పెట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటే వారికి గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. తాజాగా గంజాయి అమ్ముతున్న ఒడిశాకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు - ఇద్దరు అరెస్టు
డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్