తెలంగాణ

telangana

ETV Bharat / state

యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరో కేసు నమోదు - DRUGS CASE ON YOUTUBER PHANUMANTHU - DRUGS CASE ON YOUTUBER PHANUMANTHU

Drugs Case Filed On Praneeth Hanumanthu : యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరో కేసు నమోదైంది. అతడు​ మత్తు పదార్థాలు సేవించినట్లు వెల్లడి కావడంతో ఆయనపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశారు.

Another Case Filed On Praneeth Hanumanthu
Another Case Filed On Praneeth Hanumanthu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 10:46 AM IST

Updated : Jul 19, 2024, 1:04 PM IST

Another Case filed Against Youtuber Praneeth Hanumanthu:సామాజిక మాధ్యమంలో తండ్రి- కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరోకేసు నమోదైంది. అతడు మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కావడంతో మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రణీత్​ను ఇప్పటికే సైబర్​ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్​గూడ జైల్లో ఉన్న అతడిని 3 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్​ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు. నిందితుడి తరఫు న్యాయవాదికి పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రణీత్​ కస్టడీపై కోర్టు నిర్ణయం తీసుకోవాలసి ఉంది.

ప్రణీత్​పై నమోదు చేసిన సెక్షన్లు ఇవే :ప్రణీత్​పై ఐటీ సెక్షన్​తో పాటు 67 బీ, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు 79, 294 బీఎన్​ఎస్​, ఎన్డీపీఎస్​ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు.

పూర్వపరాలు : కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో తండ్రి- కుమార్తెలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్​ హనుమంతు వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడిని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్​కు తరలించారు.

ఇదీ జరిగింది :ప్రణీత్​ అనే యువకుడు యూట్యూబర్​గా వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తండ్రీ, కుమార్తె ఉన్న ఓ వీడియోపై అశ్లీలం ధ్వనించేలా అసభ్యకరంగా మిత్రులతో చిట్​చాట్​ చేసిన విషయం విధితమే. అతడితో పాటు మరో ముగ్గురు కలిసి వేర్వేరు ప్రదేశాల్లో కూర్చుని ఒక రీల్​ గురించి లైవ్​లో మాట్లాడారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వీడియోను చూసిన ప్రముఖ హీరో సాయి దుర్గ తేజ్​ యూట్యుూబర్​లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రాష్ట్రాల సీఎంలను 'ఎక్స్'​ వేదికగా కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్​ రెడ్డి వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

యూట్యూబర్​ ప్రణీత్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ - YouTuber Praneet Arrest

తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్​ 'ప్రణీత్​ హనుమంతు అరెస్ట్' - YouTuber Praneeth Hanumanthu arrest

Last Updated : Jul 19, 2024, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details