Another Case filed Against Youtuber Praneeth Hanumanthu:సామాజిక మాధ్యమంలో తండ్రి- కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరోకేసు నమోదైంది. అతడు మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కావడంతో మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రణీత్‌ను ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న అతడిని 3 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి తరఫు న్యాయవాదికి పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రణీత్‌పై నమోదు చేసిన సెక్షన్లు ఇవే :ప్రణీత్‌పై ఐటీ సెక్షన్‌తో పాటు 67 బీ, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు.