తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేస్తున్న యువకులు - 3 నెలల్లో రూ. 3 లక్షల సంపాదన - Drone Pilot Suresh Special Story

Drone Pilots Suresh, Mahesh Special Story : ప్రస్తుతం గ్రామీణ యువతలోని ఆలోచన విధానం మారుతోంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టడం కంటే సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్నారు. వివిధ రంగాల్లో వచ్చే మార్పులను తమకు అనుగుణంగా మలచుకునేందుకు యత్నిస్తున్నారు. దానికోసం అనేక రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక ఆలోచనే ఆ యువకుల మదిలో మెదిలింది. అటువంటి ఆలోచనను అమలుపరచి స్వయం ఉపాధిని పొందుతున్నారు. మరి, ఆ యువకులకు వచ్చిన ఆలోచనను ఏ విధంగా ఆచరణలో పెట్టారో మనమూ తెలుసుకుందామా.

Drone Pilots Suresh, Mahesh Sucess Story
Drone Pilots Suresh, Mahesh Special Story

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 2:36 PM IST

డ్రోన్‌ ద్వారా మందులు పిచికారీ చేస్తున్న యువకులు - 3 నెలల్లో రూ.3 లక్షల సంపాదన

Drone Pilots Suresh, Mahesh Special Story : ఒకరేమో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పట్టణంలోఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. కానీ, ప్రభుత్వ కొలువు ఇతన్ని పలకరించలేదు. ఇంకో యువకుడెమో పొలం పనులు చేస్తూ పూట వెల్లదీస్తున్నాడు. కానీ, ఇంకేదో చేయాలనే తాపత్రయం. దాంతో ఇద్దరు ఏకమైయ్యారు. డ్రోన్‌ ఆపరేట్‌ చేయండలో శిక్షణ తీసుకుని స్వయం ఉపాధిని పొందుతున్నారు. డ్రోన్‌ ఆపరేట్ చేస్తున్న ఈ యువకుడి పేరు సురేశ్‌. నల్గొండ జిల్లా సుంకెనపల్లి స్వస్థలం. డిగ్రీ పూర్తైన వెంటనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో పట్టణానికి పయణమయ్యాడు.

వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పైలట్‌గా మెళకువలు

Drone Pilots Suresh, Mahesh Sucess Story :కోచింగ్‌ తీసుకుని పరీక్షలకు రాసి విఫలమయ్యాడు. కానీ, ప్రభుత్వ ఉద్యోగమే శరణ్యం అనుకోలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా జిబ్లాక్​పల్లికి చెందిన మహేశ్‌తో కలిసి స్వయం ఉపాధి వైపు అడుగులేశాడు. సురేశ్‌, మహేశ్‌ ఇద్దరూ బందువులు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఒకరి కింద పనిచేయడం కంటే, స్వయంగా ఉపాధిని సృష్టించుకుని స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు. డ్రోన్‌తో మందులు పిచికారీ చేయడంలో శిక్షణ తీసుకున్నారు. రూ. 8 లక్షలు వెచ్చించి డ్రోన్‌ తీసుకెళ్లడానికి ఒక వాహనాన్ని కొనుగోలు చేశామని ఈ యువకులు చెబుతున్నారు.

డ్రోన్‌తో వరి పంటలకు పిచికారీ :డ్రోన్‌ ద్వారా వరి పంటలకు పిచికారీ చేస్తూ పైసలు సంపాదిస్తున్నారు. వాహనంలో డ్రోన్‌ను తీసుకుని సుధుర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ డ్రోన్‌తో పిచికారీ చేయడం వల్ల రైతులకు సమయంతో పాటు ఖర్చు కూడా తక్కువ వస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000 ఎకరాల వరి పంటకు డ్రోన్‌ ద్వారా మందులు స్ర్పే చేశామని ఈ యువకులు చెబుతన్నారు. 3 నెలల్లోనే అన్ని ఖర్చులు పోనూ దాదాపు రూ.3 లక్షల వరకు సంపాదించామని చెబుతున్నారు. చేతి పంపుల ద్వారా మందు పిచికారీ చేయడం వల్ల రైతుల ఆరోగ్యం క్షీణిస్తుందని ఈ యువకులు అంటున్నారు. అంతేగాకుండా ఏపుగా పెరిగిన పంటలో రైతులు వెళ్లి పిచికారీ చేస్తే పంట దెబ్బతినే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ప్రస్తుత డ్రోన్‌ టెక్నాలజీతో రైతులకు అటువంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని చెబుతున్నారు.

3 నెలల్లో రూ.3 లక్షల సంపాదన : డ్రోన్లు అందుబాటులోకి రావడం ద్వారా పంటకు సరైన సమయంలో మందులు పిచికారీ చేసే వెసులుబాటు ఉందని రైతులు అంటున్నారు. వయసు పైబడిన రైతులకు ఈ డ్రోన్‌లు ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. స్వతహాగా ఉపాధిని సృష్టించుకుని డబ్బులు సంపాదిస్తున్నారు ఈ యువకులు. రాబోవు వర్షాకాలంలో తమ డ్రోన్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలే అంతిమం కాదని, పైసలోచ్చే ప్రతి పని ఉపాధికి ఊతమిస్తుందని నిరూపించారు ఈ యువకులు.

కష్టాలను ఎదిరించి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Man Got Three Govt Jobs At A Time

ఇన్నాళ్లకు కల నెరవేరింది - కుటుంబ ఆలనా - పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి - Women Gets 5 Government Jobs

ABOUT THE AUTHOR

...view details