Drinking Water Problem in Vizianagaram District : వేసవి కాలం మెుదలు కాకముందే రాష్ట్ర ప్రజలుకు తాగునీటి కష్టాలు మెుదలయ్యాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు తాగేందుకు నీరు లేక తీవ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వ హయాంలో ట్యాంకులు నిర్మించారు. ట్యాంకల వద్దకు పైపులైన్లు వేస్తామని అధికారంలోకి తొలినాళ్లలో వైసీపీ నేతలు ప్రకటించారు. ఇప్పటి వరకు నీటిని తీసుకెళ్ల పైపులైన్లు వేయలేదు. దీంతో నగరాలలకు ఇప్పటికీ ట్యాంకర్లు వెళ్తే గానీ ప్రజల దాహం తీరని పరిస్థితి నెలకొంది. మరోవైపు జలాశయాల్లోనూ నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు
విజయనగరంలో వేసవికాలం మెుదలుకాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. చివరికి రోజులో ఎప్పుడో ఒకప్పుడు వచ్చే కుళాయిలు సైతం పని చేయటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ప్రజలు ఇప్పటికి వందేళ్ల నాటి రాణి అప్పలకొండయాంబ నీటి పథకంపైనే ఆధారపడుతున్నారు. అలాగే రామతీర్ధం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఐదు మోటర్లలో కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదేవిధంగా ముషిడిపల్లి నీటి పథకం నుంచి నగరంలోని దాదాపు 29 డివిజన్లకు నీటి సరఫర జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ నీటి లభ్యత అంతంత మాత్రమే ఉంది. దీంతో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చివరికి వీటి ద్వారా ఉన్న ప్రధాన పైపులైన్లు రోజు మరమ్మతులకు గురవుతున్నాయి.
Water Problem in Parvathipuram Manyam District : నగరంలో గతంలో వేసిన కుళాయిల్లో 30శాతానికి పైబడి నిరుపయోగంగా మారాయి. ముఖ్యంగా నగరంలో బీసీ కాలనీ, ప్రశాంతనగర్, పీవీజీనగర్, సీఆర్ కాలనీ, నానాజాతులపేట, అశోక్ నగర్, లంకాపట్నం, స్టేడియం పేట, స్టేడియం కాలనీ, సున్నపుబట్టీల వీధి, జొన్నగుడ్డి, ధర్మపురి, తోటపాలెం, కణపాక ప్రాంతాల ప్రజలు నీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.